జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు గుడి కడతామని కొందరు స్వార్థపరులు అంటున్నారని.. దాన్ని ఖండించాలని టీపీసీసీ ఇన్ఛార్జి కుంతియా పేర్కొన్నారు. మహాత్మగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేయడంతో స్వాతంత్య్రం సిద్ధించిందని తెలిపారు. గాంధీజీని ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నప్పటికీ... నోబెల్ కానీ అంతార్జాతీయ పురస్కారాలు దక్కలేదన్నారు. మహాత్మగాంధీ సిద్ధాంతాలు ప్రపంచమంతా తెలిసేలా ప్రపంచ అహింస సదస్సు నిర్వహించిన ఘనత యూపీఏ ప్రభుత్వానిదేనని తెలిపారు. అక్టోబరు 2న అంతర్జాతీయ అహింహ దినం నిర్వహించేలా ఐక్యరాజ్య సమితి ప్రకటన చేయడంలో సోనియా కృషి ఉందని చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు జానారెడ్డి, గీతారెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మహాత్మునికి మోదీ, సోనియా ఘన నివాళి