Congress Focus On Nominated Posts Telangana : రాష్ట్రంలో 50కిపైగా నామినేటెడ్ పోస్టులను జనవరి తొలి వారంలో ప్రభుత్వం భర్తీ చేయనుంది. ముఖ్యమంత్రి, ఏఐసీసీ నాయకులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసినవారు, పార్టీ గెలుపు కోసం కృషికి చేసిన నేతలకు పెద్దపీట వేయనున్నారు. అదే సమయంలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గేతో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించాలని పార్టీ వర్గాలు తెలిపాయి.
Congress Focus on Nominated Posts : కొత్త ఏడాదిలో నామినేటేడ్ పదవుల భర్తీకి తెరలేవనుంది. పార్టీ కోసం పనిచేసిన నేతలు, అసెంబ్లీ సీట్లు త్యాగం చేసిన నాయకులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదవుల భర్తీ ద్వారా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని చోట పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ యోచిస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిసారించారు. పార్టీలోని అన్ని విభాగాల నుంచి జాబితా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎవరెవరికి హామీలు ఇచ్చారో మదింపు చేస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శులు కూడా పదవుల భర్తీ ప్రక్రియలో భాగస్వామ్యులవుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యం - రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల 'హస్త'గతం దిశగా కసరత్తులు
Nominated Posts In Telangana : రాష్ట్రంలో 50కిపైగా నామినేటెడ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆర్టీసీ, పౌరసరఫరాల శాఖ, గిడ్డంగులు, ఆబ్కారీ, ఆగ్రో, రైతుబంధు సమితి, ఆయిల్ సీడ్ , బీసీ, అటవీ , టెక్సటైల్స్, ఇరిగేషన్ వంటి ముఖ్య పదవులు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం 54 నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమంది ఇప్పటికే రాజీనామా చేశారు. ఈ పదవుల్ని సకాలంలో భర్తీ చేస్తే పాలనాపరంగా మెరుగైన ఫలితాలు సాధించడం సహా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా నేతలు పార్టీకి చేదోడు వాదోడుగా నిలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది.
'బీఆర్ఎస్ హయాంలో కుంటుపడ్డ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మళ్లీ గాడినపట్టే బాధ్యత తీసుకున్నాం'
Congress Senior Leaders Hopes On Nominated Posts : పార్టీ టికెట్లు ఆశించి నిరాశకు గురైన నేతల్ని బుజ్జగించి పార్టీ మారకుండా చేయడంలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి కీలక పాత్ర పోషించారు. కీలకమైన పదవులను దక్కించుకోవడానికి వివిధ మార్గాలలో నేతలు లాబీయింగ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే పదవుల భర్తీ జరగనుండడంతో లాబీయింగ్‌కి అవకాశం లేకుండా పోయిందని కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారని సమాచారం. నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై దిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించినట్లు సమాచారం. కొత్త ఏడాది తొలి వారంలో పదవుల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తారని సమాచారం.
పెండింగ్ బిల్లుల కోసం నిధుల సమీకరణపై సర్కార్ దృష్టి - కేంద్రంపైనే ఆశలన్నీ!
ఎన్నికలకు ముందా? ఆ తర్వాతా? - తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై జోరుగా చర్చ