ETV Bharat / state

మినీ పురపోరుపై ఎస్​ఈసీ నిర్ణయం దురదృష్టకరం: కాంగ్రెస్​ - telangana latest news

రాష్ట్రంలో కరోనా తీవ్రతను పట్టించుకోకుండా మినీ పురపోరును నిర్వహించేందుకు ఎస్​ఈసీ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ జి.నిరంజన్‌ ఆక్షేపించారు. ఎన్నికల కమిషన్​ తన బాధ్యతను ఎందుకు విస్మరిస్తుందో చెప్పాలని నిలదీశారు.

congress fires on sec
మినీ పురపోరుపై కాంగ్రెస్​ స్పందన
author img

By

Published : Apr 22, 2021, 7:53 PM IST

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతితో ప్రజలు విలవిల్లాడుతుంటే మినీ పురపోరు యథావిధిగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై కాంగ్రెస్​ తీవ్రంగా మండిపడింది. కొవిడ్​ నిబంధనలు పాటించడం లేదని రాజకీయ నాయకులను తప్పుబడుతున్న ఎస్​ఈసీ.. తన బాధ్యతను ఎందుకు విస్మరిస్తుందో చెప్పాలని కాంగ్రెస్‌ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ జి.నిరంజన్‌ ప్రశ్నించారు.

ఇవాళ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తమకున్న విశేష అధికారాలను, సుప్రీంకోర్టు తీర్పులను కమిషన్‌ పేర్కొనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆ విశేష అధికారాలను అభ్యర్థుల ప్రచారాన్ని కుదింపు చేయడానికి ఉపయోగించిన కమిషన్‌.. ఎన్నికలను వాయిదా వేయడానికి ఎందుకు ఉపయోగించలేదని నిలదీశారు. మున్సిపల్​ ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయంటున్న ఎన్నికల కమిషన్.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్​ పదవుల ఎన్నికలను ఎందుకు ప్రకటించ లేదని మండిపడ్డారు. కరోనా తీవ్రతను పట్టించుకోకుండా ఎన్నికలను నిర్వహించాలని కమిషన్ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమన్నారు.

ఇదీ చూడండి: 'కరోనా విజృంభిస్తోంది... మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.