ETV Bharat / state

CONGRESS: 'కోకాపేట భూ కుంభకోణంపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు' - తెలంగాణ వార్తలు

ఈనెల 18న చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాల ‘దండోరా’ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. శనివారం రాత్రి వర్చువల్‌గా సమావేశమైన కాంగ్రెస్ కీలక నేతలు.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. కోకాపేట భూ కుంభకోణంపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయాలని తీర్మానించారు.

tpcc meeting, congress about kokapet lands
టీపీసీసీ వర్చువల్ సమావేశం, కోకాపేట భూములపై రేవంత్ రెడ్డి
author img

By

Published : Aug 15, 2021, 8:42 AM IST

ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతిపై నిరంతరం రాజీ లేని పోరాటం చేయాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం రాత్రి పీసీసీ రాజకీయ వ్యవహారాల ముఖ్య నాయకుల సమావేశం జూమ్‌ యాప్‌ ద్వారా జరిగింది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ గౌడ్‌, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ తెలంగాణ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్‌ అజ్మతుల్లా హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని తీర్మానించారు. శాసనసభ్యుల రాజకీయ ఫిరాయింపులపై కేంద్ర స్థాయిలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబరు మొదటి వారంలో వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన దండోరా సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానించడానికి వెళ్లిన సమయంలోనే కోకాపేట భూ కుంభకోణంపై పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో సంతకాలు చేయించి కేంద్ర హోంశాఖకు, సీబీఐ డైరెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని తీర్మానించారు. ఏదైనా సమస్యపై పరిష్కారమయ్యేంత వరకు పోరాటం చేయాలని, మధ్యలో ఆపేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఎంపీ కోమటిరెడ్డి అంశంపై చర్చ

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఆయనతో సంప్రదించకుండా భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో దండోరా సభ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడాన్ని కొందరు నాయకులు తప్పు పట్టినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్ష పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన్ను కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఇలాంటి నిర్ణయాలు విభేదాలను మరింత పెంచడం, పార్టీకి నష్టం కలిగిస్తాయనడంతో పాటు సభను వాయిదా వేస్తేనే బాగుంటుందని సూచించినట్లు సమాచారం. మార్చిన సభాస్థలి భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోకి రాదంటూ సభను వాయిదా వేయాల్సిన అవసరం లేదని మరి కొందరు అన్నట్లు తెలిసింది. ఏదేమైనా భవిష్యత్‌లో ఇలాంటి సభలు నిర్వహించే ముందు సంబంధిత పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఎక్కువ మంది సూచించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: మెట్‌పల్లి ఖాదీ.. నాటి నుంచి నేటి వరకు అదే స్పెషాలిటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.