ETV Bharat / state

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల సంతకాల సేకరణ: ఉత్తమ్

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా... అక్టోబర్ 2 నుంచి 31 వరకు రైతుల సంతకాల సేకరించనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

congress collectiing farmers signatures against agriculture bills
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల సంతకాల సేకరణ: ఉత్తమ్
author img

By

Published : Oct 1, 2020, 5:34 AM IST

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... ఏఐసీసీ పిలుపు మేరకు రైతుల నుంచి సంతకాల సేకరించనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 2నుంచి ప్రారంభమై... 31 వరకు కొనసాగనున్నట్టు వెల్లడించారు. నవంబర్ 14న రెండు కోట్ల మంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నట్టు చెప్పారు.

సంగారెడ్డిలో సంతకాల సేకరణ ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ ముఖ్యఅతిథిగా హాజరువుతారని ఉత్తమ్ తెలిపారు. అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు, ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేయనున్నట్టు ప్రకటించారు. నవంబర్ 14న రెండు కోట్ల మంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: 'ఆరోగ్య శ్రీ బలోపేతం... లీకేజీలను అరికట్టడానికి కమిటీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.