పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస, భాజపా డబ్బు ప్రభావంతోనే ముందంజలో ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ఆరోపించారు. డబ్బులేనిదే రాజకీయాల్లో పోటీపడకూడదని పేర్కొన్న చిన్నారెడ్డి.. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించి తెరాస కార్యకర్తలతో ఓట్లు వేయించారని చిన్నారెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ -రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన చిన్నారెడ్డి.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ ప్రక్రియలో వెనుతిరిగారు. తన ఓటమికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టభద్రులకు డబ్బులు పంచడమే కారణమని ఆరోపించిన చిన్నారెడ్డి... నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సీనియర్ నాయకుడు జానారెడ్డి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ పునర్నిర్మాణం కోసం తనవంతు కృషి చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: విదేశీ విద్య మిథ్య కాకుడదనే ఈ పథకం: మంత్రి కొప్పుల