మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులకు బీ- ఫారాలు ఇచ్చే అధికారాన్ని పీసీసీ ప్రధాన కార్యదర్శి సీజే శ్రీనివాస్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కట్టబెట్టారు. తాను ఇవ్వబోవు బీ- ఫారాలు చెల్లుబాటు కావడానికి వీలుగా ఇవాళ ఏ- ఫారాలను ఆయా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు పంపించారు. ఆ పత్రాలను ఆయా డీసీసీ అధ్యక్షులు రేపు జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు.
పురపోరులో దిగే కాంగ్రెస్ అభ్యర్థులకు స్క్రూటినీ పూర్తయిన తరువాత ఈనెల 11, 12న బీ- ఫారాలు అందజేస్తారు. రాష్ట్రంలో జరుగుతున్న 120 పురపాలక సంఘాలు, 9 నగరపాలక సంస్థల పరిధిలో బరిలో దిగనున్న 3,052 మంది అభ్యర్థులకు బీ- ఫారాలు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు.
ఈనెల 11, 12న ఆయా జిల్లాలకు కావల్సిన మేర బీ- ఫారాలు సిద్ధంగా ఉండాల్సి ఉండడం వల్ల ఏ- ఫారాలు, బీ- ఫారాలు పంపిణీ చేసే అధికారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. జీ నిరంజన్‌కు ఇవ్వగా.. ఆయనతో పాటు సీజే శ్రీనివాస్‌లు గాంధీభవన్‌లో బీ- ఫారాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇవీ చూడండి: పార్టీ మారనని బాండ్ రాసిస్తేనే బీ ఫారం...!