పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల్లో క్రేన్ ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి కోసం వేరే రాష్ట్రాల నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ చనిపోవడం బాధాకరమని ఆవేదన చెందారు. వీరి మృతితో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ స్పందించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మానిక్కం ఠాగూర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని రేవంత్ కోరారు.
-
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణంపాలుకావడం దిగ్భ్రాంతిని కలిగించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మృతులకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
— Revanth Reddy (@revanth_anumula) July 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణంపాలుకావడం దిగ్భ్రాంతిని కలిగించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మృతులకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
— Revanth Reddy (@revanth_anumula) July 29, 2022పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణంపాలుకావడం దిగ్భ్రాంతిని కలిగించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మృతులకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
— Revanth Reddy (@revanth_anumula) July 29, 2022
ఇదీ జరిగింది..
కృష్ణానదిపై ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మిస్తోన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పంప్‌హౌస్‌లోకి క్రేన్ దించుతుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. క్రేన్ వైరు తెగిపడటం వల్లే ప్రమాదం జరిగిందని తోటి కూలీలు చెబుతున్నారు.
palamuru accident today: కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద జరుగుతున్నవి. నిర్మాణ పనుల్లో భాగంగా పంప్‌హౌస్‌లోకి క్రేన్ దింపుతుండగా.. ఒక్కసారిగా తీగలు తెగిపడి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా గాయపడ్డారనే సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందారన్న సమాచారాన్ని పోలీసులు గానీ, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు గానీ ఇంతవరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఇవీ చూడండి..
పాలమూరు లిఫ్ట్ పనుల్లో అపశ్రుతి.. ఐదుగురు కూలీలు దుర్మరణం
మరో యువకుడు దారుణ హత్య.. సీఎం పరామర్శకు వెళ్లి వస్తున్నప్పుడే..