ETV Bharat / state

Engineering courses: ఇంజినీరింగ్‌ కొత్త కోర్సులపై విద్యార్థుల్లో అయోమయం

ఇంజినీరింగ్‌ కొత్త కోర్సులపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు శనివారం నుంచి ఎంసెట్‌ వెబ్‌ఆప్షన్లు ప్రారంభం కానుండటం.. మరోవైపు ప్రభుత్వం నుంచి కోర్సులకు అనుమతి రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు, విద్యార్థుల్లో అయోమయం ఏర్పడింది.

Engineering courses: ఇంజినీరింగ్‌ కొత్త కోర్సులపై అయోమయం

author img

By

Published : Sep 10, 2021, 7:45 AM IST

2021-22 సంవత్సరం నుంచి బీటెక్‌లో నాలుగు, ఎంటెక్‌లో ఏడు కోర్సులు తీసుకురావాలని జేఎన్‌టీయూ ప్రతిపాదించింది. ఆయా కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) సైతం అనుమతిచ్చింది. బీటెక్‌లో సీఎస్‌ఈ విభాగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌- డేటాసైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజైన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌-మెషిన్‌లెర్నింగ్‌, మెకానికల్‌ విభాగంలో ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ కోర్సులు అందుబాటులోకి రావాల్సి ఉంది. కళాశాలలకు జేఎన్‌టీయూ అనుమతిచ్చింది. ఈ కోర్సుల పరిధిలో కొత్తగా 2,600 సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. అయితే.. కొత్త కోర్సులు, సీట్ల పెంపునకు గురువారం రాత్రి వరకు ప్రభుత్వం ఆమోదం ఇవ్వలేదు. శుక్రవారం వినాయకచవితి సెలవు. శనివారం నుంచే వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ షురూ కానుండటంతో అప్పటికల్లా సీట్లు అందుబాటులోకి వస్తాయా..? రావా..? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయాన్ని కళాశాల యాజమాన్యాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అందుబాటులోకి 157 కళాశాలలు..

ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లకు గురువారం రాత్రి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 157 కళాశాలల జాబితాను అధికారులు టీఎస్‌-ఎంసెట్‌ వెబ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇందులో జేఎన్‌టీయూ పరిధిలోనివి 133 కళాశాలలుండగా.. మిగిలినవి వివిధ యూనివర్సిటీలు, యాజమాన్యాల పరిధిలో ఉన్నాయి. జేఎన్‌టీయూ పరిధిలోని మిగిలిన కళాశాలలకు సంబంధించి అధ్యాపకుల జీతాల చెల్లింపు విషయంలో ఫిర్యాదులు ఉండటంతో అండర్‌ టేకింగ్‌ లేఖలు తీసుకుని అనుమతిస్తున్నారు. వేతనాలు చెల్లించినట్లుగా రశీదులు చూపించడం, రానున్న రోజుల్లో చెల్లిస్తామని హామీపత్రాలిస్తేనే వర్సిటీ అధికారులు అఫిలియేషన్‌ ఇస్తున్నారు. శుక్రవారం సెలవు అయినప్పటికీ మరికొన్ని కళాశాలలను ఎంసెట్‌ వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి: Engineering Counseling: ఎంసెట్​ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ మారింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.