ETV Bharat / state

EAMCET: ఇంజినీరింగ్ కాలేజీలు, సీట్లపై విద్యార్థుల్లో గందరగోళం - telangana varthalu

ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు వెబ్ ఆప్షన్లు ప్రారంభమైనప్పటికీ.. కళాశాలలు, కోర్సుల అనుమతి ప్రక్రియ పూర్తి కాలేదు. రోజుకు కొన్ని కాలేజీలు, సీట్లను వెబ్ సైట్​లో అందుబాటులో ఉంచుతున్నారు. నేటి వరకు రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు 98 వేల 128కి చేరాయి. రేపు మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇంజినీరింగ్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గడువు ఈనెల 13 వరకు పొడిగించారు.

EAMCET: ఇంజినీరింగ్ కాలేజీలు, సీట్లపై విద్యార్థుల్లో గందరగోళం

author img

By

Published : Sep 11, 2021, 7:57 PM IST

ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ విద్యార్థులను అయోమయానికి గురి చేస్తోంది. కాలేజీలు, సీట్లు ఎంచుకునేందుకు ఇవాళ వెబ్ ఆప్షన్ల నమోదు మొదలైంది. అయితే కోర్సుల అనుమతి ప్రక్రియను జేఎన్​టీయూహెచ్ ఇంకా కొనసాగిస్తూనే ఉంది. రోజు కొన్ని కాలేజీలు, సీట్లను ఎంసెట్ వెబ్​సైట్​లో పొందుపరుస్తున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 172 కళాశాలల్లో 98 వేల 128 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 15 యూనివర్సిటీ కాలేజీల్లో 3 వేల 645 సీట్లు..157 ప్రైవేట్ కళాశాలల్లో 87 వేల 962 సీట్లకు ఇప్పటి వరకు ఆమోదం లభించింది. వాటిలో 65 వేల 219 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. మరో 6 వేల 521 సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటా కోసం మంజూరయ్యాయి.

జేఎన్​టీయూహెచ్ 5 యూనివర్సిటీ కాలేజీల్లో 1790 సీట్లకు, 141 ప్రైవేట్ కళాశాలల్లో 77 వేల 998 సీట్లకు నేటి వరకు అనుమతినిచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ 2 ప్రభుత్వ కాలేజీల్లో 620 సీట్లు..13 ప్రైవేట్ కాలేజీల్లో 8 వేల 540 సీట్లకు అనుమతివ్వగా.. కాకతీయ యూనివర్సిటీ 3 ప్రభుత్వ కాలేజీల్లో 825, 3 ప్రైవేట్ కాలేజీల్లో 1424 సీట్లకు అనుమతినచ్చాయి. బీఫార్మసీలో సుమారు పదివేల సీట్లు, ఫార్మ్ డీలో దాదాపు 1600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రోజు రోజుకు కోర్సులు, సీట్లు పెరుగుతున్నందున.. విద్యార్థులు చివరి రోజు వరకు వెబ్ ఆప్షన్లు ఫ్రీజ్ చేయకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ధ్రువపత్రాల పరిశీలన గడువు పెంపు

ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన గడువును ఎల్లుండి వరకు పొడిగించారు. స్లాట్ బుకింగ్, కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు గడువు తేదీ కూడా ఈనెల 13 వరకు పొడిగించారు. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ఈనెల 16తో ముగియనుండగా.. ఈనెల 18న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు.

ఇదీ చదవండి: Engineering courses: ఇంజినీరింగ్‌ కొత్త కోర్సులపై విద్యార్థుల్లో అయోమయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.