ETV Bharat / state

'తమకు ఆ పన్ను మినహాయించాలని ఆందోళన'

లాక్​డౌన్​తో గత రెండున్నర నెలలుగా బస్సులు, క్యాబ్​లు నడపలేదని.. ఈ నేపథ్యంలో తమకు మూడు నెలల పన్నును మినహాయించాలని క్యారేజ్ బస్సులు, క్యాబ్ యాజమాన్యం నిరసన చేపట్టారు.

Concerned to exclude the tax carriage buses
'తమకు ఆ పన్ను మినహాయించాలని ఆందోళన'
author img

By

Published : Jun 18, 2020, 2:47 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో గత రెండున్నర నెలలుగా బస్సులు, క్యాబ్​లు నడపలేదని క్యారేజ్ బస్సులు, క్యాబ్ యాజమాన్యం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. మూడు నెలల పన్నును మినహాయించాలని డిమాండ్ చేశారు.

వాహనాలు నడపనందున ట్యాక్స్ మినహాయించాలని ఆర్టీఏ అధికారులకు మెమోరాండం సమర్పించారు. ఇప్పటికే లాక్​డౌన్​తో ఆదాయం కోల్పోయామన్నారు. ఈ పన్నుతో తమపై మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు.

ఇదీ చూడండి : సెలవిక: బరువెక్కిన జన హృదయం.. అడుగడుగునా పూలవర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.