ETV Bharat / state

ARREST: హనుమాన్​ విగ్రహం కోసం 'భజరంగ్​దళ్' ఆందోళన.. అరెస్ట్ - telangana latest news

రామానాయుడు స్టూడియో సమీపంలోని గుట్టపై ఉన్న హనుమాన్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ భజరంగ్​దళ్​ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తొలగించిన విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్టించాలని డిమాండ్​ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కార్యకర్తలను అరెస్ట్​ చేశారు.

ARREST: హనుమాన్​ విగ్రహం కోసం 'భజరంగ్​దళ్' ఆందోళన.. అరెస్ట్

author img

By

Published : Sep 6, 2021, 5:18 PM IST

హైదరాబాద్ ఫిలింనగర్‌లో భజరంగ్​దళ్​ నేతలు ఆందోళనకు దిగారు. రామానాయుడు స్టూడియో సమీపంలోని గుట్టపై ఉన్న హనుమాన్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ అక్కడ బైఠాయించారు. గుట్ట పైనుంచి తొలగించిన ఆంజనేయుడి విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్టించాలని డిమాండ్​ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. భజరంగ్​దళ్‌ కార్యకర్తలను అరెస్ట్​ చేసి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ పోలీస్​స్టేషన్‌లకు తరలించారు.

భజరంగ్​దళ్ కార్యకర్తల అరెస్ట్
భజరంగ్​దళ్ కార్యకర్తల అరెస్ట్

పోలీసుల తీరుపై భజరంగ్​దళ్​ నేతలు మండిపడ్డారు. మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని భజరంగ్​దళ్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ సుభాశ్​చందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మందిరాలను దర్శించుకోవద్దని ప్రభుత్వమేమైనా ఉత్తర్వులు జారీ చేసిందా చూపాలని డిమాండ్ చేశారు. గుట్టపై అనేక సంవత్సరాలుగా ఉన్న హనుమాన్ విగ్రహాన్ని తొలగించడం బాధాకరమన్న ఆయన.. ఇదివరకు హనుమాన్ విగ్రహం ఉన్నచోటే మందిరాన్ని నిర్మించాలన్నారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

కార్యకర్తలను పోలీస్​స్టేషన్​కు తరలిస్తున్న పోలీసులు

ఇదీ జరిగింది..

రామానాయుడు స్టూడియో సమీపంలోని గుట్టపై ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి తొలగించారు. ఆ విగ్రహాన్ని గుట్ట కింద ప్రతిష్టించారు. విషయం తెలుసుకున్న భజరంగ్​దళ్​ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విగ్రహాన్ని తిరిగి గుట్టపై ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: khairathabad ganesh: దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్​ గణపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.