TS Police Constable Final Exams Completed: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసు నియామక మండలి నిర్వహించిన కానిస్టేబుల్ తుది పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. లక్షా 9వేల 663 మంది సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గానూ లక్షా 8వేల 55మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే 98.53 శాతం మంది పరీక్ష రాశారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థుల్లో 6వేల801 మందికి గానూ 6వేల 88 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దాదాపు 98.53 శాతం సివిల్ కానిస్టేబుల్, 89.52 శాతం ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థులు పరీక్ష రాశారు.
త్వరలో అందుబాటులోకి రాతపరీక్ష 'కీ': సివిల్ కానిస్టేబుల్ పరీక్ష కోసం హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 183 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నియామక మండలి పేర్కొంది. ఐటీ సివిల్ కానిస్టేబుల్ పరీక్షకు మాత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు తెలిపింది. త్వరలో రాతపరీక్ష ప్రాథమిక సమాధాన పత్రాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది.
ఆరోపణల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్: పరీక్షల నిర్వహణలో అవకతవల ఆరోపణల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. చరవాణి, గడియారం సహా దేన్నీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. సచివాలయం ప్రారంభం దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 254 మంది పోలీసు సిబ్బంది మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరీక్షకు రేణుక అనే యువతి 20రోజుల పసిబిడ్డతో హాజరైంది. ఆమె పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన సమయంలో ఆమె భర్త చిన్నారి ఆలనాపాలనా చూసుకున్నారు.
ఎస్సై తుది రాత పరీక్షలకు 96 శాతం మంది హాజరు: ఎస్సై, ఏఎస్సై స్థాయి సిబ్బంది నియామకానికి తుది రాత పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీలలో జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో ఆ రెండు రోజులు ఉదయం, మధ్యాహ్నం వేళ రెండు విడతలుగా సివిల్, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, పోలీస్ రవాణా సంస్థల ఎస్సై స్థాయి, ఫింగర్‌ప్రింట్ బ్యూరో విభాగం ఏఎస్సై స్థాయి అభ్యర్థులకు పరీక్షలు జరిగాయి. దాదాపు 96 శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఇవీ చదవండి: