హైదర్‌గూడ, ఉప్పరిపల్లి వాసులకు మెహిదీపట్నం, రేతిబౌలి ట్రాఫిక్ చిక్కుల నుంచి విముక్తి కలిగింది. పీవీ ఎక్స్‌ప్రెస్ వేలో 166 నుంచి 155 నెంబరు పిల్లర్ వరకు కొత్తగా చేపట్టిన ర్యాంపు నిర్మాణం పూర్తయ్యింది. దీనిని అధికారికంగా ప్రారంభించకపోయినా రెండువారాలుగా రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఇక్కడే మరోవైపు దిగే ర్యాంపు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండు మూడు నెలల్లో ఇవి కూడా పూర్తికానున్నాయని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.
ప్రయోజనమిలా..
మెహిదీపట్నం, రేతిబౌలి వద్ద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ఇక్కడ గంటకు రద్దీ వేళల్లో వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కార్లు పైనుంచి వెళితే కింద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ద్విచక్రవాహనదారులు, స్వల్పదూరం వెళ్లేవారికి ఊరటగా ఉంటుంది.
ఇదీ చూడండి: చదువుల తల్లీ.. సీట్లు అనుగ్రహించవేమి!