హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కనీస వసతుల్లేకపోవడం, సరైన వైద్యం అందకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఓ ఛానెల్ విలేకరి చనిపోయాడంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో జర్నలిస్టు ఫోరం ఫర్ తెలంగాణ సభ్యులు ఫిర్యాదు చేశారు. జూన్ 4న మనోజ్ అనే విలేకరి.. సోదరుడితో కలిసి గాంధీలో చేరగా.. అర్ధరాత్రి తీవ్రంగా ఆయాసపడుతున్న విలేకరికి కనీసం ఆక్సిజన్ అందించకపోగా ఐసీయూలోకి తరలించలేదని ఫోరం నేతలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే విలేకరి చనిపోయాడని... అతని కుటుంబానికి రూ. కోటి పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కమిషన్‌ను కోరారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై స్పందించిన హెచ్ఆర్సీ ఆగస్టు 17లోపు మనోజ్ మృతిపై నివేదిక అందించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్