రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిపై దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి క్రిష్ణస్వరూప్.. హైదరాబాద్ నాంపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. మాసబ్ ట్యాంక్ ఏసీ గార్డ్స్ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లు ఖరారు చేయకుండా షెడ్యూలు ఎలా ఇచ్చారని అడిగినట్లు తెలిపారు. సమాధానం చెప్పాల్సిన నాగిరెడ్డి... త్రీవ పదజాలంతో దూషించడమే కాకుండా... తన సిబ్బందితో దాడి చేయించారని క్రిష్ణస్వరూప్ ఆరోపించారు.
ఎన్నికల అధికారి నాగిరెడ్డి, సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'తెరాస, ఎంఐఎంలు మోదీ కోసం పనిచేస్తున్నాయి'