ETV Bharat / state

కలెక్షన్లు ఉంటేనే సెలక్షన్లు.. హెచ్​సీఏపై ఆరోపణలు - తెలంగాణ వార్తలు

క్రీడాకారుల ఎంపిక విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​పై హెచ్చార్సీలో ఫిర్యాదు నమోదైంది. కలెక్షన్లు ఉంటేనే సెలక్షన్లు జరుగుతున్నాయని ఆల్ ఇండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ ఆరోపించింది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను అణచివేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు.

complaint-against-hyderabad-cricket-association-in-state-human-rights-commission
హెచ్చార్సీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​పై ఫిర్యాదు
author img

By

Published : Feb 12, 2021, 8:09 AM IST

Updated : Feb 12, 2021, 10:44 AM IST

క్రికెట్ క్రీడాకారుల ఎంపికలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలకు పాల్పడుతోందని ఆల్ ఇండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ ఆరోపించింది. ఇటీవల ప్రకటించిన విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీ టీమ్ ఎంపికలో ప్రతిభను పరిగణలోకి తీసుకోకుండా... ఇష్టానుసారంగా ఎంపిక చేశారంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ నేతృత్వంలో ఈ అవకతవకలు జరుగుతున్నాయని రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ పిటిషన్​లో పేర్కొన్నారు. కలెక్షన్లతోనే సెలక్షన్లు జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రతిభ ఉన్న ఆటగాళ్లను అణచివేస్తోందని విమర్శించారు. ఇటీవల అత్యధిక సెంచరీలు చేసిన అభిరత్ రెడ్డి, వరుణ్ గౌడ్, అనిరుధ్ రెడ్డిలను కాకుండా... ఒక్క సెంచరీ చేయని హిమాలయ్ అగర్వాల్, భగత్ వర్మ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ విషయంలో బీసీసీఐ ఛైర్మన్​ సౌరబ్ గంగూలీ, సీఎం కేసీఆర్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​లు జోక్యం చేసుకోవాలని కోరారు. ఎంపిక చేసిన జట్టును తక్షణమే రద్దు చేసి... లోదా కమిషన్ సిఫార్సుల మేరకు కొత్త జట్టును ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. హెచ్​సీఏ అవకతవకలపై విచారణకు ఆదేశించాలని హెచ్చార్సీని కోరినట్లు మహేశ్వర్ రాజ్ తెలిపారు.

ఇదీ చదవండి: యాదాద్రి క్షేత్రంలో భక్తులకు మౌలిక వసతులపై దృష్టి

Last Updated : Feb 12, 2021, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.