ETV Bharat / state

తెరాస కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం: ఎంపీ అర్వింద్​

తెరాస కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. వరద సాయం పంపిణీని తామెందుకు అడ్డుకుంటామని ప్రశ్నించిన అర్వింద్​.. రూ.10 వేలు పంపిణీ చేయాల్సి వస్తుందని.. కేసీఆరే ఎన్నికల కోడ్​ను తీసుకొచ్చారని ఆరోపించారు.

MP ARVIND
గ్రేటర్​లో భాజపా, మజ్లిస్​కు మధ్యే పోటీ: ధర్మపురి అర్వింద్​
author img

By

Published : Nov 19, 2020, 6:52 PM IST

Updated : Nov 19, 2020, 7:01 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాజపా, మజ్లిస్​కు మధ్యే పోటీ ఉంటుందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ తెలిపారు. మజ్లిస్​తో దోస్తీ చేస్తున్న ముఖ్యమంత్రి.. ముస్లింలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. భాజపాపై యుద్ధం ప్రకటించాలంటే.. ముందు ఫాంహౌస్​ నుంచి కేసీఆర్ బయటకురావాలి కదా అని ఎద్దేవా చేశారు. జీహెచ్​ఎంసీలో తెరాసకు మెజార్టీ రాకుండే.. మజ్లిస్​ చేతిలో గ్రేటర్​ పీఠం పెడతారని.. వారు వస్తే బ్రాండ్​ హైదరాబాద్​ కాస్తా.. ఆదాబ్​ హైదరాబాద్​ చేస్తారని విమర్శించారు.

హైదరాబాద్​లో వరద సాయం పంపిణీని తామేందుకు అడ్డుకుంటామని అర్వింద్ ప్రశ్నించారు. సాయం పంపిణీ చేయాల్సి వస్తుందనే.. కేసీఆర్​ ఎన్నికల కోడ్​ తీసుకొచ్చారని ఆరోపించారు.

ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో తెరాస కనుసన్నల్లో నడుస్తోందని అర్వింద్​ ఆరోపించారు. కొంతమంది అధికారులపైన ఫిర్యాదు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్​లను బదిలీ చేయమని లేఖ రాస్తామన్నారు. ఎన్నికల్లో భాజపాను అణిచివేయాలని చూస్తే ప్రత్యేక అధికారిని తీసుకొస్తామని వెల్లడించారు.

ఎల్బీ స్టేడియంలో కేసీఆర్​ సభ పెడితే.. ప్రజల కంటే పోలీసులే ఎక్కువ మంది ఉంటారని అర్వింద్​ అన్నారు. దేశంలో అనేక ప్రాంతాలను విద్యుదీకరణ చేసిన ఘనత మోదీకే చెందుతుందని పేర్కొన్నారు. ప్రతి డివిజన్​లో కాంగ్రెస్​కు 20 నుంచి 30 ఓట్లు మాత్రమే ఉన్నాయని విమర్శించారు.. కాంగ్రెస్​ ముక్త్​ భారత్​ అయ్యే వరకు చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు.

పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్​ ఒక పెద్ద సంస్థనైనా తెలంగాణకు తీసుకువచ్చారా అని అర్వింద్​ ప్రశ్నించారు. గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణకు ఒక్క పెద్ద సంస్థ కూడా తీసుకురాలేదని ఆరోపించారు.

ఇవీచూడండి: హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

Last Updated : Nov 19, 2020, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.