ETV Bharat / state

Commercial Taxes Department Focus on Assembly Elections : తాయిలాలు, ప్రలోభాలపై వాణిజ్య పన్నుల శాఖ నిఘా.. స్పెషల్​ టీమ్స్​తో దాడులు - తెలంగాణ పోలీసుల తనిఖీలు

Commercial Taxes Department Focus on Assembly Elections : ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను వాణిజ్య పన్నుల శాఖ అడ్డుకుంటోంది. వందకుపైగా ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తోంది. పంపిణీకి, ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉన్న, అనుమానిత వస్తువులను స్వాధీన పరుచుకుంటోంది. పది రోజుల్లో దాదాపు రూ.17 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్న వాణిజ్య పన్నుల శాఖ.. రైల్వే పార్సిల్‌ కేంద్రాలు, ప్రైవేట్ గోడౌన్లు, కొరియర్‌ సంస్థలపై నిఘా పెట్టింది.

Election Commission
Election Commission Action Over TS Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 9:11 AM IST

Commercial Taxes Department Focus on Assembly Elections : రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. పెద్ద ఎత్తున వివిధ వస్తువులు పంపిణీ జరుగుతుండడాన్ని నిలువరించాలని వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, కమిషనర్‌ క్రిష్టినా చొంగ్తుల నేతృత్వంలో ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 14 వాణిజ్య పన్నుల డివిజన్‌ కార్యాలయాల పరిధిలో ఒక్కో డివిజన్‌కు నాలుగు చొప్పున 56 బృందాలతో పాటు.. మరో 50 ప్రత్యేక బృందాలు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మొత్తం 106 ప్రత్యేక బృందాలకు సీటీవో, డీసీటీవో స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తుండటంతో అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుని వస్తువులను జప్తు చేస్తున్నారు.

EC Issues Notice to Telangana Pragathi Bhavan : ప్రగతిభవన్ సాక్షిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. బీఆర్ఎస్​పై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు

Election Code In Telangana : ప్రధానంగా నాయకుల బొమ్మలు, పార్టీ గుర్తులు కలిగిన బెడ్‌ షీట్లు, టవళ్లు, సైకిళ్లు, మోటార్‌ సైకిళ్లు, క్రికెట్‌ కిట్లు, జిమ్‌ పరికరాలు, బంగారం, వెండి, ఆభరణాలు వంటి 26 రకాల వస్తువులను జప్తు చేయాలని ఎన్నికల సంఘం ఓ జాబితా ఇచ్చినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా రైల్వే పార్సిల్‌ కార్యాలయాలు, ట్రాన్స్‌పోర్టు గోడౌన్లు, ప్రైవేటు బస్సుల పార్సెల్‌ కేంద్రాలు, కొరియర్‌ సర్వీస్‌ కేంద్రాలు తదితర వాటిపై ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువులపై పార్టీలకు చెందిన స్టిక్కర్లు, పోటీలో నిలబడే నాయకుల బొమ్మలు ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లులు ఉండి సరఫరా చేస్తున్నట్లయితే వాటిని ఆయా నాయకుల ఎన్నికల ఖర్చులో జమ చేస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Violation Of Election Code In Miryalaguda : మిర్యాలగూడలో ఎన్నికల కోడ్​కు ముసుగేసిన మున్సిపాలిటీ అధికారులు..

ఈ నెల 9న ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి రెండు రోజుల క్రితం వరకు రూ.16.95 కోట్ల విలువైన ప్రలోభ పెట్టే వస్తువులను వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో రూ.కోటి విలువైన చీరలు, దాదాపు రూ.60 లక్షల విలువైన రోల్‌ గోల్డ్‌ వస్తువులు, రూ.4 కోట్లకుపైగా విలువైన స్టీల్‌ గిన్నెలు, కుక్కర్లు, టిఫిన్‌ బాక్స్‌లు, ఫ్లాస్క్‌లు ఉన్నాయి. రూ.2 కోట్లకు పైగా విలువైన గోడ గడియారాలు ఉండగా ఇవి కాకుండా వివిధ రకాల ప్రలోభ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏవీ కూడా ఇప్పట్లో విడుదల ఉండదని.. ఎన్నికల తర్వాత వాటి విలువపై జీఎస్టీ చెల్లిస్తే విడుదల చేస్తామని వెల్లడించారు.

Election Commission Action Over TS Elections ఎన్నికల వేళ.. నిఘా పెట్టిన వాణిజ్య పన్నులు శాఖ

MLC Elections: తెలంగాణలో ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నేటినుంచే కోడ్ అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.