ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ప్రారంభమైంది. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు వద్ద పథకాన్ని ఆ రాష్ట్ర సీఎం జగన్ ప్రారంభించారు. సర్వేరాయి పాతారు. సర్వే కోసం వినియోగించే పరికరాలను భూముల రీసర్వే వివరాలు, వాటి ఫలితాలను సీఎంకు అధికారులు వివరించారు.
రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మూడు దశల్లో చేపట్టి 2023 జనవరికి సర్వేను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే జరగనుంది. వందేళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో మళ్లీ సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టారు. తక్కెళ్లపాడులో జరిపిన రీ-సర్వే మ్యాప్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పరిశీలించారు. డ్రోన్ ఆపరేట్ చేసి సర్వే ప్రక్రియను ఆవిష్కరించారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు.