హైదరాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరీనా యాప్‌టెక్ ఏవియేషన్ అకాడమీ సెంటర్‌ను ప్రభుత్వ కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ గంగాధర్ ప్రారంభించారు. యానిమేషన్, ఏవియేషన్ కోర్సులు చేసిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉందని, రానున్నది యానిమేషన్ యుగమేనని ఆయన పేర్కొన్నారు. ఈ కోర్సులు చేసిన వాళ్లు దేశ, విదేశాల్లో ఉన్నత ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గేమింగ్‌జోన్ దగ్గర నుంచి ఏవియేషన్ కోర్సుల వరకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు యాప్‌టెక్ ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ సతీష్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: కశ్మీర్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు