కేసీఆర్, కేటీఆర్‌పై భాజపా అగ్రనాయకులు దురుసుగా మాట్లాడితే సహించేది లేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హెచ్చరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంపై సరైన అవగాహన లేకుండా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొంతమంది తెరాసను వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలిపారు.
కరీంనగర్‌పై పట్టున్న బండిసంజయ్‌కు కంటోన్మెంట్ పరిస్థితులు తెలియవన్నారు. కరోనా సమయంలో లక్షమందికి భోజనాలు అందించిన ఘనత తెరాసకే దక్కుతుందని బోయిన్పల్లి మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వరద సాయంలో ఎక్కడ అక్రమాలు జరిగాయో నిరూపించాలని సవాలు విసిరారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి కంటోన్మెంట్ అభివృద్ధి చేస్తే తాము కూడా సంతోషిస్తామని ఆయన తెలిపారు.