ETV Bharat / state

12 లోక్​సభ స్థానాలపై కాంగ్రెస్​ గురి - ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటన

CM Revanth Reddy Review on Lok Sabha Elections 2024 : పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 స్థానాలకు తగ్గకుండా కచ్చితంగా గెలిచే లక్ష్యంతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు నిధులు అందుబాటులో ఉంచి, అత్యవసర పనులకు ఉపయోగించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా సమయం కేటాయించి, అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్న సీఎం, ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు.

CM Revanth Reddy Review on Lok Sabha Elections 2024
CM Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 9, 2024, 8:20 AM IST

17 పార్లమెంటు స్థానాలపై కాంగ్రెస్ టార్గెట్- ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన

CM Revanth Reddy Review on Lok Sabha Elections 2024 : పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్‌ శ్రేణులను సమాయత్తం చేసే పనిని రాష్ట్ర నాయకత్వం (Congress Government) చేపట్టింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి హోదాలో పార్టీ నాయకులతో రేవంత్‌ రెడ్డి సమావేశమై లోక్‌సభ ఎన్నికలకు పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్ష నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 10 ఉమ్మడి జిల్లాల మంత్రులతో, నాయకులతో రోజువారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Congress Plans Lok Sabha Elections 2024 Telangana : ఇందులో భాగంగా మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఓటమి పాలైన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. అధికారం చేపట్టిన తర్వాత పాలన, ప్రభుత్వపరంగా క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. 17 పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించినప్పటికీ, కచ్చితంగా 12 స్థానాలు గెలవాలని లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే, పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలకు ముందా? ఆ తర్వాతా? - తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై జోరుగా చర్చ

Congress Focus on Parliament Elections 2024 : వారంలో మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులు కలిసి, ప్రజల సమస్యలను తెలియచేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 14న దావోస్‌ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 26 నుంచి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ ఉంటుందని చెప్పారు.

Revanth Reddy First Public Meeting as Chief Minister in Indravelli : గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించారు. ఇదేవిధంగా సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటి సభ (CM Revanth Reddy First Meeting) ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు తెలిపిన రేవంత్‌ రెడ్డి, అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్​ రెడ్డి ఇవాళ సాయంత్రం మరో ఐదు ఉమ్మడి జిల్లాల నాయకులతో సమావేశమై, తాజా రాజకీయ పరిణమాలపై ఆరా తీయనున్నారు. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, హైదరాబాద్‌ జిల్లాల ఇంఛార్జీ మంత్రులు, నాయకులతో సమీక్షించనున్నారు.

ప్రతిపక్షాల విమర్శలపై ఎదురుదాడికి సిద్ధమవుతోన్న కాంగ్రెస్ - కార్యాచరణ సిద్ధం!

పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ - తాజా పరిస్థితులపై అధిష్ఠానానికి నివేదిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.