ETV Bharat / state

మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష - ప్రజాపాలన, ఆరు గ్యారెంటీల అమలుపై చర్చ - cm revanth meeting today

CM Revanth Reddy Review Meeting Praja Palana Applications Today : ప్రజాపాలన దరఖాస్తుల తదుపరి కార్యాచరణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమీక్ష జరిపిన తదనంతరం, ప్రజాపాలన ప్రత్యేక వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభిస్తారు. అభయహస్తం పథకాల్లో మరో మూడింటిని త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

CM Revanth Reddy
CM Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 7:05 AM IST

Updated : Jan 8, 2024, 12:01 PM IST

CM Revanth Reddy Review Meeting Praja Palana Applications Today : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన తదుపరి కార్యక్రమంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన, ఆరు గ్యారెంటీల అమలు కార్యాచరణపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పథకాలకు సంబంధించి ఆదాయ మార్గాలు, అభయహస్తం పథకాల అమలు ప్రారంభం గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన Prajapalana.telangaana.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు.

ప్రజల నుంచి అనూహ్య స్పందన : కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తామన్న గ్యారెంటీలకు (Praja Palana Program in Telangana) ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు నిర్వహించిన ప్రజాపాలనలో రాష్ట్రవ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, ఇతర అంశాలపై 19,92,747 ఉన్నాయి. తెలంగాణలో 1,11,46,293 కుటుంబాల పరిధిలోని 16,392 పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు.

నెల రోజుల ప్రస్థానంపై రేవంత్ ట్వీట్ - 'మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా నా బాధ్యత నిర్వర్తిస్తా'

దరఖాస్తుల సమాచారం 17లోగా ఆన్‌లైన్‌లోకి : ప్రజాపాలనలో మొత్తం 3714 అధికార బృందాలు 44,568 కౌంటర్ల ద్వారా అర్జీలు స్వీకరించారు. దరఖాస్తుల్లోని సమాచారాన్ని మండల, మున్సిపల్ కేంద్రాల్లో కంప్యూటరీకరిస్తున్నారు. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తి కానుంది. రేషన్, ఆధార్‌ కార్డు నంబర్ల ఆధారంగా అసలైన లబ్ధిదారులు ఎంత మంది ఉంటారు, పథకాల అమలుకు ఎన్ని నిధులు అవసరమనే ప్రాథమిక అంచనాకు రానున్నారు.

'ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజాపాలన లక్ష్యం - అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం'

Prajapalana Website Launch Today : రైతుబంధు నిధుల విడుదల, ఆదాయం, అప్పుల సమీకరణ, కొత్త రేషన్ కార్డులు వంటి అంశాలపై సైతం నేటి సమీక్షలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఫించన్లను రూ.4000కు పెంచడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కు సిలిండర్ ఇవ్వడం వంటి మూడు పథకాలను త్వరలో ప్రారంభించే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు పూర్తయిన నేపథ్యంలో, ఇప్పటికే అమలు చేసిన హామీలతో పాటు సత్వరమే అమలు చేయనున్న హామీల గురించి ప్రజలకు వివరించడానికి కార్యాచరణ రూపొందించనున్నారు.

హైదరాబాద్‌లో అత్యధికంగా దరఖాస్తులు : జిల్లాల వారీగా అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలో హైదరాబాద్‌ జిల్లాలో 13.7 లక్షల దరఖాస్తులు రాగా, రంగారెడ్డి జిల్లాలో 10.2 లక్షలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 9.2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 1.82 లక్షలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా 1.46 లక్షలు, ములుగు జిల్లా 1.10 లక్షల దరఖాస్తులతో చివరి స్థానాల్లో నిలిచాయి.

త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

రాష్ట్రంలో టాాటా టెక్నాలజీస్ నైపుణ్య శిక్షణ- విధి విధానాలపై కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశం

Last Updated : Jan 8, 2024, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.