ETV Bharat / state

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్​రెడ్డి - మహాలక్ష్మి పథకం ప్రారంభం

Revanth Reddy Launch Mahalakshmi Scheme Today : రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు పథకాలను ప్రారంభించారు. రేవంత్​రెడ్డి జీరో చార్జీ టికెట్ పోస్టర్​లను సీఎస్ శాంతికుమారి, బాక్సర్​ నిఖత్​ జరీన్​ల​కు అందించారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

TSRTC Free Bus Service Women in Telangana
Revanth Reddy Launch Mahalakshmi Scheme Today
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2023, 1:49 PM IST

Updated : Dec 9, 2023, 7:49 PM IST

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్​రెడ్డి - మహాలక్ష్మి పథకం ప్రారంభం

Revanth Reddy Launch Mahalakshmi Scheme Today : కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ఉద్ఘాటించారు. అసెంబ్లీ ఆవరణలో ఆరు గ్యారెంటీల్లోని రెండు పథకాలైన మహలక్ష్మి, చేయూత పథకాల్ని సీఎం ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే కార్యక్రమాన్ని మంత్రులు, అధికారులతో కలిసి సీఎం అందుబాటులోకి తెచ్చారు.

తెలంగాణ కొత్త కేబినెట్ మంత్రులు - ఎవరెవరికి ఏయే శాఖ కేటాయించారంటే?

TSRTC Free Bus Service Women in Telangana : సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను ప్రారంభిస్తున్నాన్న రేవంత్‌రెడ్డి మహిళలు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకంతో(Mahalakshmi scheme) పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10లక్షలకు పెంచే చేయూత పథకాన్ని అమల్లోకి తెచ్చింది.

ఇటీవల ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం, శాసనసభ ఆవరణలోనే రెండు గ్యారంటీల అమలు ప్రారంభోత్సవం నిర్వహించారు. ముందుగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ లోగోను మంత్రులు, అధికారులతో కలిసి ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ సాయాన్ని 5లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ చేయూత పథకాల్ని అమల్లోకి తెచ్చారు.

అసెంబ్లీలో తొలిరోజు 100 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం - బీజేపీ సభ్యుల గైర్హాజరు

అనంతరం మహాలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు తీసుకువచ్చిన ఈ పథకాన్ని మంత్రులు, అధికారులతో పాటు ప్రముఖ క్రీడాకారణి నిఖత్‌ జరీన్‌తో కలిసి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు సంబంధించిన లోగో, గోడ పత్రికలను, జీరో ఛార్జ్‌ టికెట్‌ను సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ పండగరోజని రెండు గ్యారంటీలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్దామని సీఎం పిలుపునిచ్చారు.

"కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఇకనుంచి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. మహాలక్ష్మీ పథకం, ఆరోగ్య శ్రీని రూ. 10 లక్షలకు పెంచుతున్నాము. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తాము". - రేవంత్​రెడ్డి, సీఎం

అనంతరం ఆర్టీసీ బస్సులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్ రావు ఠాక్రే, మంత్రులతో కలిసి ట్యాంక్‌బండ్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వచ్చారు. బాబాసాహెబ్‌కు నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీకి వెళ్లారు. అంతకుముందు పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు(Boxer Nikhat jareen) సీఎం రేవంత్‌రెడ్డి 2కోట్ల రూపాయల చెక్కు అందించారు.

"మహాలక్ష్మి పథకం అందరికి ఉపయోగపడే పథకం. ఇది మహిళా సాధికారతకు కృషి చేస్తుంది. ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు నేను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది". - నిఖత్​ జరీన్, బాక్సర్

రాష్ట్రవ్యాప్తంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు - 78 కిలోల కేక్‌ కట్‌ చేసిన రేవంత్‌రెడ్డి

Last Updated : Dec 9, 2023, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.