ETV Bharat / state

సీఎం రేవంత్​రెడ్డి దావోస్ పర్యటన ఖరారు - ఈనెల 15న ​జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు - Telangana government

CM Revanth Reddy Davos Tour Schedule : సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలి విదేశీ పర్యటన ఖరారయ్యింది. ఈనెల 15 నుంచి 18 వరకు దావోస్​లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం హాజరు కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

cm revanth davos tour
CM Revanth Reddy Davos Tour Schedule
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 12:16 PM IST

CM Revanth Reddy Davos Tour Schedule : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15 నుంచి 18 వరకు దావోస్​లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం హాజరు కానున్నారు. దావోస్​కు సీఎం రేవంత్​ రెడ్డితో(CM Revanth reddy) పాటు సీఎంవో ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్దన్ రెడ్డి, సీఎస్ఓ తఫ్సీర్ ఇక్బాల్, భద్రతా అధికారి గుమ్మి చక్రవర్తి, మీడియా ప్రతినిధి కర్రి శ్రీరాం, సహచరుడు ఉదయ్ సింహా తదితరులు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్(Davos tour) నుంచి లండన్ వెళ్లి అక్కడ మూడు రోజులు పర్యటించే అవకాశం ఉంది.

సీఎం రేవంత్​ రెడ్డిని కలిసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ బృందం

Alloments Departments of CMO Officers : ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రభుత్వం మరో కార్యదర్శిని నియమించింది. ఐఏఎస్ అధికారి మాణిక్‌రాజ్​ సీఎం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆరుగురు కార్యదర్శులు, ఓఎస్డీకి ముఖ్యమంత్రి కార్యాలయం శాఖలను కేటాయించింది.

  • సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి : ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణ, సమన్వయంతో పాటు సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, హోం, ఆర్థిక, ప్రణాళిక, న్యాయ, శాసన, భూరెవెన్యూ విభాగాలు
  • కార్యదర్శి కె.మాణిక్‌రాజ్‌ : విద్యుత్, ఇరిగేషన్, విద్య, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, గనుల శాఖలు
  • సీఎం కార్యదర్శి, ఐఎఫ్ఎస్ చంద్రశేఖర్ రెడ్డి : అటవీ, పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయ, పశుసంవర్ధక, పౌరసరఫరాలు, ఆర్అండ్ బీ, హౌజింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు
  • సీఎం కార్యదర్శి, ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసీం : ముఖ్యమంత్రి భద్రతా వ్యవహారాలతో పాటు బీసీ, మైనార్టీ సంక్షేమం, విపత్తు నిర్వహణ, క్రీడల విభాగాల బాధ్యతలు
  • సీఎం ప్రత్యేక కార్యదర్శి, ఐడీఈఎస్ అధికారి బి.అజిత్ రెడ్డి : ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్లు, సీఎంఆర్ఎఫ్, పురపాలక, పరిశ్రమలు, ఐటీ, కార్మిక, ఉపాధి, శాఖలు
  • సీఎం సంయుక్త కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ఎస్.సంగీత సత్యనారాయణ : వైద్యారోగ్య, కుటంబ సంక్షేమం, మహిళ, శిశు, వృద్ధుల సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలతో సీఎంవో అడ్మినిస్ట్రేషన్
  • సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు : దేవదాయ, సాంస్కృతిక, పర్యాటక శాఖలతో పాటు సీఎం కార్యాలయం పిటిషన్లు, కంప్యూటరీరణ, ప్రజావాణి, బాధ్యతలు

నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్​ డెవలప్​మెంట్​ నిధులు : సీఎం రేవంత్ రెడ్డి

మూడు కస్టర్లుగా తెలంగాణ విభజన : సీఎం రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.