ETV Bharat / state

కరోనా రోగుల చికిత్సకు అన్ని సదుపాయాలు సిద్ధం : సీఎం కేసీఆర్ - corona pandemic situation Latest news

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌పై అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్ కొవిడ్-19 రోగులకు అందిస్తోన్న చికిత్స, సదుపాయాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గాంధీ ఆస్పత్రిలో 2 వేల మందికిపైగా చికిత్స అందించేందుకు సామర్ధ్యం ఉందని స్పష్టం చేశారు.

కరోనా రోగుల కోసం అన్ని సదుపాయాలు ఉన్నాయి : సీఎం కేసీఆర్

author img

By

Published : Jun 8, 2020, 10:14 PM IST

Updated : Jun 9, 2020, 9:23 AM IST

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌పై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై అధికారులను ఆయన ఆరా తీశారు. కరోనా రోగులకు అవసరమైన చికిత్సకు అన్ని సదుపాయాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఎంత మందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆసుపత్రులకు ఉందని సీఎం స్పష్టం చేశారు. రోగులకు చికిత్స, సదుపాయాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. గాంధీ ఆస్పత్రిలో 2 వేల మందికిపైగా చికిత్స అందించేందుకు సామర్ధ్యం ఉందన్నారు.

ప్రస్తుతం గాంధీలో 247 మంది..

ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 247 మంది కరోనా రోగులు మాత్రమే ఉన్నారని వివరించారు. గాంధీ ఆస్పత్రి కొవిడ్ పేషంట్లతో కిక్కిరిసిపోయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఏ కారణంతో మరణించినా సరే కొవిడ్‌ పరీక్షలు చేయాలనడం సరికాదని హితవు పలికారు. అందరికీ పరీక్షలు చేయాలనే హైకోర్టు ఆదేశం అమలు చేయడం సాధ్యం కాదన్నారు. కరోనా విషయంలో వాస్తవ పరిస్థితికి, జరుగుతున్న ప్రచారానికి పొంతనే లేదన్నారు.

పేషంట్లు ఎక్కువైతే చికిత్స అందించే ఏర్పాట్లు లేవనీ దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణ రాష్ట్రంలోనే వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. 9.61 లక్షల పీపీఈ కిట్లను సిద్ధంగా ఉంచాం. 14 లక్షల ఎన్ 95 మాస్కులున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్లు మొత్తం 3600 సిద్ధంగా ఉన్నాయి. వెంటిలేటర్లు, టెస్ట్ కిట్లు, ట్యాబ్లెట్లు, ఇతరత్రా పరికారలన్నీ సిద్ధంగా చేశాం. ఎంతమందకైనా చికిత్స అందించడానికి వైద్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకుని ఇళ్లకు పోయిన వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆసుపత్రిలో సకల సౌకర్యాలతో మంచి వైద్యం అందించారని బహిరంగంగా చెబుతున్నారు. వైరస్ సోకిన వారు అంత తృప్తిగా ఉంటే, కొందరు మాత్రం విమర్శలు చేయడం బాధాకరం. -- సీఎం కేసీఆర్.

Last Updated : Jun 9, 2020, 9:23 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.