ETV Bharat / state

నేడు విజయవాడ వెళ్లనున్న సీఎం కేసీఆర్​

ఈనెల 21న జరిగే కాశేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​ను ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్​ ఇవాళ విజయవాడ వెళ్లనున్నారు. మధ్యాహ్నం జగన్​ నివాసానికి చేరుకుని ఆహ్వానం పలుకుతారు.

కేసీఆర్​ విజయవాడ పర్యటన
author img

By

Published : Jun 16, 2019, 10:46 PM IST

Updated : Jun 17, 2019, 7:22 AM IST

కేసీఆర్​ విజయవాడ పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ సోమవారం విజయవాడ వెళ్లనున్నారు. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్మోహన్​ రెడ్డిని ఆహ్వానించనున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్​​ను ఆహ్వానించారు.

ఇదీ షెడ్యూల్​....

ముఖ్యమంత్రి కేసీఆర్​ మధ్యాహ్నం 12:50 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. తర్వాత విజయవాడ గేట్​వే హోటల్​లో విశ్రాంతి తీసుకుని... అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 2:30 గంటలకు తాడేపల్లిగూడెంలోని జగన్​ నివాసానికి చేరుకుని... కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరుకావలసిందిగా ఆహ్వానిస్తారు. సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చేరుకుని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. తిరిగి రాత్రి 7:30 గంటలకు గన్నవరం నుంచి హైదరాబాద్​కు పయనమవుతారు.

ఇదీ చూడండి : వర్షాలొస్తున్నాయని భయపడకండి... మేం సిద్ధమే!

Last Updated : Jun 17, 2019, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.