ETV Bharat / state

CM KCR District Tour: సీఎం కేసీఆర్​ జిల్లాల పర్యటన! - హైదరాబాద్​ జిల్లా వార్తలు

CM KCR District Tour: ముఖ్యమంత్రి కేసీఆర్​ త్వరలో జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. వివిధ ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యాక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చర్చించారు. పార్టీ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయనున్నారు.

CM KCR District Tour
CM KCR District Tour
author img

By

Published : Dec 12, 2021, 5:38 AM IST

Updated : Dec 12, 2021, 6:25 AM IST

CM KCR District Tour: ముఖ్యమంత్రి కేసీఆర్​ త్వరలో జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. వివిధ ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యాక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తై మంగళవారం రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో సీఎం.. జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, జనగాం, యాదాద్రి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సీఎం పర్యటించవచ్చని తెలుస్తోంది.

బహిరంగ సభలు...

కలెక్టరేట్లను ప్రారంభించడంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్​ పాల్గొననున్నారు. కొత్తగా మంజూరు చేసిన వైద్య కళాశాలల భవనాలకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. పూర్తయిన చోట తెరాస జిల్లా కార్యాలయాలను ప్రారంభిస్తారు. పార్టీ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్​ జిల్లా పర్యటనలకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: Revanth visits martyrs stupa: 'సచివాలయం మీదున్న శ్రద్ధ.. అమరవీరుల స్తూపంపై లేదు'

Last Updated : Dec 12, 2021, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.