ETV Bharat / state

CM KCR: మూడు రోజులు దిల్లీలోనే కేసీఆర్​.. నేడే పయనం.. అందుకేనా? - telangana varthalu

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు దేశరాజధాని దిల్లీలో పర్యటించనున్నారు. దిల్లీలో రేపు తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు.

CM KCR: మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్​ హస్తిన పర్యటన

author img

By

Published : Sep 1, 2021, 2:22 AM IST

రెండు వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి హస్తినలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోనుంది. దిల్లీలో తెరాస కార్యాలయ నిర్మాణం కోసం రేపు పార్టీ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన బయల్దేరనున్నారు. కేసీఆర్​తో పాటు కొంత మంది మంత్రులు, నేతలు అదే విమానంలో వెళ్తారు. రేపు మధ్యాహ్నం 12.30గంటలకు దిల్లీలో తెరాస కార్యాలయ భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వసంతవిహార్ మెట్రో స్టేషన్ సమీపంలో 1300 గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా హస్తిన వెళ్లనున్నారు. ఇప్పటికే కొంత మంది దిల్లీ వెళ్లగా మిగతా వారు ఇవాళ వెళ్లనున్నారు. శంకుస్థాపన అనంతరం అక్కడ జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. హస్తిన పర్యటనలో కొంత మంది కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉందని అంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారు.

ఇదీ చదవండి: SCHOOLS REOPEN: రాష్ట్రంలో తెరచుకోనున్న విద్యాసంస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.