ETV Bharat / state

ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించొద్దు: కేసీఆర్​ - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించొద్దని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్​ కోరారు. దేశంలోని ప్రధాన నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉందని కేసీఆర్​ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రాల రుణాలను రీషెడ్యూల్​ చేయాలని, రుణ పరిమితిని పెంచాలని విన్నవించారు. జులై, ఆగస్టు నెలల్లోనే కరోనా వ్యాక్సిన్​ వచ్చే అవకాశముందన్నారు.

ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించొద్దు: కేసీఆర్​

author img

By

Published : May 11, 2020, 6:10 PM IST

Updated : May 11, 2020, 8:30 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో.. సీఎం కె.చంద్రశేఖర్ రావు.. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు, చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉందని... ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ సంఖ్యలో బాధితులున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయని.. ఎవరు ఎటు పోతున్నారో తెలియదని సీఎం వ్యాఖ్యానించారు. వారికి వైరస్​ ఉందో లేదో తెలియదన్న ఆయన... అందరికీ పరీక్షలు చేయడం కుదరదని చెప్పారు. రైళ్లలో వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్ చేయడం కూడా కష్టమన్న కేసీఆర్... ఇప్పుడిప్పుడే ఆ రైళ్లను నడపొద్దని కోరారు.

కరోనాతో కలిసి బతకడం తప్పదు..

కరోనా ఇప్పుడే వదిలి పోయేట్టు కనిపించడం లేనందున.. వైరస్​తో కలిసి బతకడం తప్పదని.. ఆ దిశగా ప్రజల్ని నడిపించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ముందు ప్రజల్లో భయాన్ని పోగొట్టి కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని... భారతదేశం నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నుంచే జూలై, ఆగస్టు నెలల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని తెలిపారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్న సీఎం... వైద్యపరంగా సర్వ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

అప్పులు కట్టే పరిస్థితి లేదు..

పరికరాలు, మందులు, మాస్కులు, పీపీఈ కిట్లు, పడకలు కావాల్సినవన్ని ఉన్నాయని... ఏ కొరతా లేదని కేసీఆర్​ వివరించారు. కరోనా, లాక్ డౌన్ ఆదాయాలు లేవని, అప్పులు కట్టే పరిస్థితి ఏ రాష్ట్రానికి లేదని సీఎం చెప్పారు. రైతుల రుణాలను బ్యాంకులు రీ షెడ్యూల్ చేసినట్లు.. రాష్ట్రాల రుణాలను రీషెడ్యూల్ చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలని మరోసారి కోరారు. రాష్ట్రాల రుణపరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు.

వలస కార్మికులపై సానుభూతి చూపించాలి..

వలస కార్మికుల విషయంలో అన్ని రాష్ట్రాలు సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలని కేసీఆర్ సూచించారు. సొంతూర్లో పిల్లలను, తల్లిదండ్రులను చూసుకోవాలనుకుంటున్న వారిని పోనివ్వకపోతే అనవసరంగా ఆందోళనలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. శ్రామిక్ రైళ్లు వేయడం మంచి నిర్ణయమన్న ఆయన... తెలంగాణ నుంచి పోదామనుకుంటున్న వారిని పంపుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర రైసుమిల్లులలో పనిచేసే బిహార్ కార్మికులు ప్రత్యేక రైలు ద్వారా మళ్లీ తెలంగాణకు వచ్చారని... వారిని సాదరంగా స్వాగతించామని సీఎం చెప్పారు. వలసకూలీలను రానిస్తూ, పోనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కంటైన్మెంట్​ జోన్లలో లాక్ ​డౌన్​ కచ్చితం..

కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అలక్ష్యం చేయవద్దని కేసీఆర్​ అన్నారు. కేసులు లేని జిల్లాలను ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్చాలన్న ముఖ్యమంత్రి... ఈ విషయంలో కేంద్ర ప్రకటనలో జాప్యం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. పాజిటివ్ కేసులు లేని ప్రాంతాల్లో ఇతర కార్యకలాపాలు సాధ్యమవుతాయని.. రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి రాగానే జాప్యం లేకుండా జోన్ల మార్పు జరగాలని కేసీఆర్ కేంద్రానికి సూచించారు.

ఇదీ చూడండి: 'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'

Last Updated : May 11, 2020, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.