ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో (kcr in assembly sessions) ప్రకటించారు. భట్టి విక్రమార్క వినతిపై స్పందించిన సీఎం.. ఫీల్డ్ అసిస్టెంట్లను వెళ్లాకే నిధుల వినియోగం పెరిగిందని వెల్లడించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగులు కాకపోయినా వారు ఉద్యోగులం అనుకుంటున్నారని తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునే అంశం పరిశీలిస్తాం. వాళ్లను తొలగించాకే పనులు ఎక్కువ జరగుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగులమనే భ్రమలో ఉండి వెళ్లిపోయారు.
- కేసీఆర్, ముఖ్యమంత్రి
దేశంలో ఎక్కడా లేవు
ప్రస్తుతం గురుకులాల్లో పెట్టే ఆహారం కూడా తానే నిర్ణయించానని చెప్పారు. విద్యావేత్తల సలహా మేరకే ఐదో తరగతి నుంచి గురుకులాలు అని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనన్ని గురుకులాలు రాష్ట్రంలో ఉన్నాయని వివరించారు. అత్యవసరం కాకపోతే అసైన్డ్ భూములు తీసుకోవద్దని చెప్పామని పేర్కొన్నారు. అత్యవసరమై అసైన్డ్ భూములు తీసుకుంటే ఇతరులకు ఇచ్చినట్టే పరిహారం ఇస్తామన్నారు.
త్వరలో ఆ పథకం
హైదరాబాద్‌లో 9 అంతస్తుల వరకూ రెండు పడక గదుల ఇల్లు కడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. సొంత భూమిలో ఇల్లు కట్టుకునే పథకం త్వరలో ప్రారంభిస్తామన్నారు. సొంత భూమిలో ఇల్లు కట్టుకునే పథకం విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. నియోజకవర్గానికి 1000 లేదా 1500 మందికి అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు.
రెండు పడక గదుల ఇళ్ల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాం. సొంత భూమిలో ఇల్లు కట్టుకునే పథకం త్వరలో ప్రారంభిస్తాం. సొంత భూమిలో ఇల్లు కట్టుకునే పథకం విధివిధానాలు ఖరారు చేస్తాం. నియోజకవర్గానికి 1000 లేదా 1500 మందికి అవకాశం ఇస్తాం.
-కేసీఆర్, ముఖ్యమంత్రి
కాంగ్రెస్‌పై విమర్శలు
కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్నే పాలించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏమీ చేయలేదని అనట్లేదు.. మంచిగా చేయలేదంటున్నామని తెలిపారు. '''కాంగ్రెస్ కరెంట్ ఇవ్వలేదు.. మేం ఇస్తున్నాం..'' అని తెలిపారు. కాంగ్రెస్ నీళ్లివ్వలేదు..తాము ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌కు మేనేజ్‌మెంట్ స్కిల్స్ లేవు.. తమకు ఉన్నాయని వివరించారు. గతంలో కరెంట్ ఇవ్వలేకపోతే అసెంబ్లీలోనే ఉరేసుకుంటానని రోశయ్య అన్నారని గుర్తు చేశారు. రోశయ్య సూట్‌కేసులో ఉరితాడు కూడా అసెంబ్లీకి తెచ్చుకున్నారని తెలిపారు. ''మేమందరం రోశయ్యను.. మీరు పెద్దమనిషి అంటూ వారించాం'' అని అనాటి విషయాలు చెప్పుకొచ్చారు. ప్రపంచ మేధావి కూడా కరెంట్ ఇస్తానని ఇవ్వలేదని అన్నారు. వక్ఫ్ భూముల కోసం కొట్లాడిన చరిత్ర మాకు ఉందని వెల్లడించారు.
ఇదీ చూడండి: KCR Speech in Assembly sessions 2021: కేంద్రం దగ్గరే లేవు.. ఇక తెలంగాణకు ఏమిస్తరు: కేసీఆర్