ETV Bharat / state

ఇంటి ముందే కేసీఆర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న అభిమాని - HAPPY BIRTHDAY KCR

తన ఇంటి ముందే సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ కార్యకర్త. తల్లిదండ్రుల తర్వాత కేసీఆరే తనకు దేవుడని... రోజూ ఆయనను చూసుకునేందుకు ఇంటి ముందే ఆవిష్కరించుకున్నట్లు వివరించాడా అభిమాని.

CM KCR STATUE INAUGURATED IN FRONT OF KCR FAN'S HOME

author img

By

Published : Feb 17, 2020, 6:45 PM IST

Updated : Feb 17, 2020, 7:29 PM IST

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్​కి చెందిన బత్తుల వెంకటేశ్​ అనే వ్యక్తి సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. కేసీఆర్​ 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని తన అభిమానాన్ని చాటుకునేందుకు ఇంటి ముందే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గ్రామస్థులు, కుటుంబసభ్యులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటంతో కూడిన కేక్​ను కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉంటున్నారని వెంకటేశ్​ వివరించారు. లక్ష రూపాయల ఖర్చుతో విగ్రహాన్ని తయారు చేయించినట్లు తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత కేసీఆర్​నే దేవుడిగా భావిస్తానని, ప్రతిరోజు ఉదయం ఆయనను చూడాలనే ఉద్దేశంతో ఇంటి ఎదుటే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నానన్నాడు. రాష్ట్రానికి మరో 20 ఏళ్ల పాటు కేసీఆరే సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెంకటేశ్​ తెలిపాడు.

ఇంటి ముందే కేసీఆర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న అభిమాని

ఇవీ చూడండి: ట్విట్టర్​ ట్రెండింగ్​లో హ్యాపీ బర్త్​డే కేసీఆర్

Last Updated : Feb 17, 2020, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.