ETV Bharat / state

'నిర్లక్ష్యం వద్దు.. మరింత అప్రమత్తంగా ఉండాలి' - రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం రివ్యూ

కరోనా వైరస్ పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వైరస్ నియంత్రణ చర్యల్లో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

'నిర్లక్ష్యం వద్దు.. మరింత అప్రమత్తంగా ఉండాలి'

author img

By

Published : Apr 19, 2020, 6:02 AM IST

కరోనా నియంత్రణ చర్యల్లో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని... ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఏ ఒక్కరూ.. ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా చూడాలని పేర్కొన్నారు. కరోనా కట్టడి, రోగులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలుపై ... ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున... జీహెచ్​ఎంసీ పరిధిలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలని సూచించారు.

కంటైన్మెంట్‌ జోన్ల నిర్వహణ కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం అన్నారు. ఎంత మందికైనా పరీక్షలు చేయడానికి, చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. తెల్లరేషన్‌ కార్డుదారులకు నగదు, బియ్యం ఉచితంగా పంపిణీ చేశామన్న కేసీఆర్... వలస కూలీలు కార్మికులను గుర్తించి సాయమందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ కార్యక్రమాలు యథావిధిగా జరిగేట్లు చూడాలని... కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేశారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో 800 దాటిన కరోనా కేసుల సంఖ్య..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.