ETV Bharat / state

'అన్నదాతలు నష్టపోవద్దనే మక్కలు కొంటున్నాం' - మక్కల కొనుగోలుపై ముఖ్యమంత్రి సమీక్ష

వానాకాలంలో పండించిన మొక్కజొన్న పంటను కూడా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే క్వింటాలుకు1850 రూపాయల మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అన్నదాతలు నష్టపోతుంటే చూడలేకే మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

'అన్నదాతలు నష్టపోవద్దనే మక్కలు కొంటున్నాం'

author img

By

Published : Oct 24, 2020, 4:56 AM IST

వానాకాలం పంటల కొనుగోళ్లు, యాసంగి సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, పౌరసరఫరాలశాఖల మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సీఎస్ సోమేష్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. వానాకాలంలో సాగుచేసిన మొక్కజొన్న కొనుగోళ్లపై సమావేశంలో చర్చించారు. మద్దతు ధర వచ్చే అవకాశం లేనందున మొక్కజొన్న సాగు చేయొద్దని ప్రభుత్వం చెప్పినప్పిటికీ... కొందరు రైతులు సాగు చేశారని సీఎం కేసీఆర్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దన్నప్పటికీ సాగు చేసినందున ప్రభుత్వానికి మొక్కజొన్న కొనుగోలు చేసే బాధ్యత లేదని సీఎం గుర్తుచేశారు.

క్వింటాకు రూ.850 చొప్పున నష్టం

యాసంగిలో తొమ్మిది లక్షల టన్నుల మొక్కజొన్నను 1668కోట్లతో మార్క్ ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తే... మార్కెట్లో ధర లేకపోవడం వల్ల వేలం వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కేవలం 823 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని ముఖ్యమంత్రి వివరించారు. మార్క్‌ఫెడ్‌కు 845 కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులను కోరిందన్నారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పసుపు పంటకు అంతరంగా కొద్దిపాటి ఎకరాల్లో మాత్రమే వేయాలని సూచించినట్లు తెలిపారు.

యాసంగిలో సాగు చేయొద్దు

యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కజొన్న సాగు చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మరోమారు విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఎవరైనా మొక్కజొన్న సాగు చేస్తే ప్రభుత్వ బాధ్యత ఉండదని స్పష్టం చేశారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అనుసరించిన విధానం వల్లే మొక్కజొన్నకు ధర పడిపోయిందని... 50 శాతం ఉన్న దిగమతి సుంకాన్ని కేంద్రం 15 శాతానికి తగ్గించిందని ఆక్షేపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాద్దాంతం చేసే వారి మాటలు నమ్మొద్దని కోరారు.

ఇదీ చూడండి: వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు.. ఎందుకంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.