ETV Bharat / state

ప్రభుత్వ సంస్థలే రైతుల వద్దకు వస్తాయి: కేసీఆర్

author img

By

Published : Oct 7, 2020, 2:06 PM IST

కరోనా సమయంలో రైతులు మార్కెట్లకు ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడనవసరం లేదని... ప్రభుత్వ సంస్థలే రైతుల వద్దకు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు.

cm kcr review meeting again on agriculture at pragathi bhavan
ప్రభుత్వ సంస్థలే రైతుల వద్దకు వస్తాయి: కేసీఆర్

ప్రభుత్వ సంస్థలే రైతుల వద్దకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని... మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, అధికారులతో సీఎం మరోసారి సమీక్ష నిర్వహించారు.

రైతుల శ్రేయస్సు కోసం...

కరోనా ప్రమాదం పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సు దృష్ట్యా... ప్రభుత్వ సంస్థలను గ్రామాలకు పంపి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని సీఎం తెలిపారు. ధాన్యం ఎంత వస్తుందో పక్కా అంచనా వేసి, కొనుగోళ్ల కోసం ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. బ్యాంకు గ్యారెంటీలు సహా... ధాన్యం అమ్మకం, డబ్బు వెంటనే చెల్లించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కార్యచరణ సిద్ధం కావాలి..

గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ ఇంకా విస్తృతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ తెలిపారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సూచనకు అనుగుణంగా రైతులు పది లక్షలకు పైగా ఎకరాల్లో కంది సాగు చేయడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. కంది పంట కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు.

ఇదీ చూడండి: శాంతిభద్రతలపై కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.