న్యాయవాద దంపతుల హత్య కేసు దురదృష్టకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారని వెల్లడించారు. పోలీసులు నిష్పక్షపాతంగా కేసును ఛేదిస్తున్నారని తెలిపారు. నిందుతులు ఎంతటివారైనా శిక్షనుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఈ కేసు హైకోర్టు పరిధిలోనే ఉందని... సీబీఐకి ఇచ్చే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
న్యాయవాద దంపతుల హత్యకు తెరాసకు సంబంధంలేదని కేసీఆర్ వెల్లడించారు. నిందితుడిగా ఉన్న తెరాస నేతను పార్టీ నుంచి అప్పటికప్పుడే తొలగించామని... వెంటనే అతను అరెస్టు కూడా అయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: సభలో భట్టి మాట్లాడుతుండగా.. సీఎం కేసీఆర్ జోక్యం!