ETV Bharat / state

CM KCR Message On Forest Martyrs Day : ''జంగల్ బచావో–జంగల్ బడావో'ను చిత్తశుద్ధితో అమలు చేయాలి' - సీఎం కేసీఆర్ అటవీ అమరవీరుల దినోత్సవం సందేశం

CM KCR Message On Forest Martyrs Day 2023 : నేడు అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు సందేశం ఇచ్చారు. అడవుల రక్షణ కోసం అమరులైన వారి ఆశయాలు సజీవంగా ఉండాలంటే.. జంగల్ బచావో–జంగల్ బడావో నినాదాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పని చేసిన అధికారులు, సిబ్బంది 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్న సీఎం.. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తి దాయకమని అన్నారు.

Forest Martyrs Day
CM KCR Forest Martyrs Day Message
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2023, 1:06 PM IST

CM KCR Forest Martyrs Day Message 2023 : అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలంటే.. జంగల్ బచావో–జంగల్ బడావో నినాదాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం సందేశం ఇచ్చారు. అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమన్న ఆయన.. రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు గుర్తు చేశారు. దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు చూస్తున్నామని తెలిపారు. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అన్నివర్గాల మద్దతు లభించటంతో ఇవాళ అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

Attack on Forest Officer in Adilabad : అటవీ అధికారిపై గొడ్డలితో దాడి చేసిన తండ్రీకుమారులు.. అదే కారణం!

Forest Martyrs Day in Telangana 2023 : హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం అందించే వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ హైదరాబాద్‌కు దక్కిందని కేసీఆర్ పేర్కొన్నారు. అభివృద్ది ఎంత సాధించినా.. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా.. ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. పర్యావరణపరంగా తగిన రక్షణ చర్యలు చేపట్టని ఫలితమే గ్లోబల్ వార్మింగ్ రూపంలో చూస్తున్నామని అన్నారు. మనతో పాటు భవిష్యత్ తరాలూ పుడమిపై జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ దిశగా అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని.. హరిత తెలంగాణ కోసం లక్షిత పచ్చదనం 33 శాతం సాధించే దాకా కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

అటవీ అధికారులకు మద్దతివ్వాలి.. పోలీసులకు డీజీపీ ఆదేశాలు

Forest Martyrs Day 2023 : ఈ క్రమంలోనే అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పని చేసిన అధికారులు, సిబ్బంది.. 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్న సీఎం కేసీఆర్.. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తి దాయకమని చెప్పారు. అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు హృదయ పూర్వక శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆశయాలు సజీవంగా ఉండాలంటే.. ప్రభుత్వం అమలు చేస్తున్న జంగల్ బచావో–జంగల్ బడావో నినాదాన్ని చిత్తశుద్ధితో మనం అమలు చేయాలని, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

FRO Srinivasa Rao Murder Case : ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు

అటవీ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి.. : అటవీ అమరవీరుల త్యాగాలను మరువొద్దని, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. జాతీయ‌ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్ స్మారక చిహ్నం వద్ద మంత్రి, అధికారులు, సిబ్బంది పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు. అట‌వీ సంప‌ద‌ను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాల‌ర్పించి.. వీర‌మ‌ర‌ణం పొందిన అట‌వీ సిబ్బంది త్యాగాలు వృధా కానివ్వ‌కుండా, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. విధి నిర్వ‌హ‌ణ‌లో అట‌వీ సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. 1984 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 22 మంది తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోవ‌డం చాలా బాధాక‌రమని అన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందని.. అట‌వీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్ర‌భుత్వం అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

విషాదంలోనూ.. విజేతగా నిలిచిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుమార్తె

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.