బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్‌తో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో తొలిరోజైన శుక్రవారం ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగ ప్రతిని.. తమిళిసైకి అందించారు. ఇతర అంశాలపైనా ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ప్రత్యేకించి కరోనా వైరస్ నియంత్రణా చర్యలు, ముందుజాగ్రత్త చర్యలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది.
ఇవీ చూడండి: ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం