ముఖ్యమంత్రి కేసీఆర్ 'ఆత్మబంధువు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. దళితబంధు పథకంపై జూలురి గౌరిశంకర్ సంపాదకత్వంలో వెలువడిన 'ఆత్మబంధువు' గ్రంథాన్ని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి.. గౌరిశంకర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం తమ కుమార్తె వివాహానికి రావాలని గౌరిశంకర్ దంపతులు ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు.
దేశంలోని సంక్షేమ పథకాల్లో దళిత బంధు విప్లవాత్మకమైందని వివరించిన గ్రంథం ఆత్మబంధువు అని... రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను, దళిత బంధుపై జరిగిన ప్రగతిశీల కృషిని పుస్తకరూపంలో ప్రపంచానికి అందించిన కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. దళితుల ఆర్థిక స్వాతంత్య్ర పొలికేక దళిత బంధు అని ఈ గ్రంథంలో వివరించడం జరిగిందని కేసీఆర్ తెలిపారు.
ఇదీ చదవండి: Bathukamma on Burj Khalifa: విశ్వవ్యాప్తమైన బతుకమ్మ పూలసంబురం.. బుర్జ్ ఖలీఫాపై తెలంగాణం