ETV Bharat / state

కర్నల్​ సంతోష్​ భార్యకు డిప్యుటీ కలెక్టర్​గా ఉత్తర్వులు - cm kcr Job orders to santhoshi

కర్నల్​ సంతోష్​బాబు భార్య సంతోషికి డిప్యుటీ కలెక్టర్ ఉద్యోగానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను సీఎం కేసీఆర్​ అందించారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హైదరాబాద్​ పరిధిలోనే తనకు పోస్టింగ్​ ఇవ్వాలని సీఎం అధికారులకు తెలిపారు.

cm kcr Job orders to Colonel Santosh Babu's wife
కర్నల్​ సంతోష్​బాబు భార్యకు ఉద్యోగ ఉత్తర్వులు
author img

By

Published : Jul 22, 2020, 4:47 PM IST

Updated : Jul 22, 2020, 7:09 PM IST

కర్నల్​ సంతోష్​ భార్యకు డిప్యుటీ కలెక్టర్​గా ఉత్తర్వులు

భారత-చైనా సరిహద్దుల్లో మరణించిన కర్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషికి ప్రగతిభవన్​లో అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని తన కార్యదర్శి స్మితా సభర్వాల్​ను ముఖ్యమంత్రి కోరారు. సంతోషితోపాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​లో మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: సీఎం కేసీఆర్​

Last Updated : Jul 22, 2020, 7:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.