ETV Bharat / state

ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు: కేసీఆర్ ‌ - telangana news today

సీఎం కేసీఆర్​ రాష్ట్ర ప్రజలకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా​ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.

cm KCR Greetings, World Health Day news
ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు: కేసీఆర్ ‌
author img

By

Published : Apr 7, 2021, 6:48 AM IST

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా తిరిగి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నిబంధనలను కచ్చితంగా పాటించి వైరస్‌ను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. ‘‘ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. దీనికి దోహదపడే పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వైద్య వ్యవస్థను బలోపేతం చేసింది. హైదరాబాద్‌ మహానగర పరిధిలో బస్తీ దవాఖానాలు నిర్వహిస్తూ సత్ఫలితాలను సాధించింది. మిగతా పట్టణాల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే చర్యలు చేపట్టింది. గత ఏడాది కాలంగా కరోనా కష్టకాలాన్ని తెలంగాణ తట్టుకుని నిలబడడానికి ప్రజల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణం. రోగ నిరోధక శక్తి స్థాయి పెరగడానికి ఇవి దోహద పడ్డాయి.

మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నల్లా నీటిని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. తల్లీ, బిడ్డల సంరక్షణే లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్ల పథకం విజయవంతమై, మాతా శిశు సంక్షేమం మెరుగు పడింది. కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలు తగ్గిపోయి, తద్వారా బాల్య ప్రసవాలకు అడ్డుకట్ట పడింది’’ అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి : మెడ్‌ట్రానిక్‌ కేంద్రాన్ని ప్రారంభించనున్న కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.