ETV Bharat / state

Lata Mangeshkar: భారత సంగీత ప్రపంచంలో ఆమెది చెరగని ముద్ర: కేసీఆర్ - latha mangeshkar

Latha Mangeshkar: ప్రముఖ గాయని, భారతరత్న, భారత నైటింగేల్‌గా గుర్తింపు పొందిన లతా మంగేష్కర్ మృతి పట్ల సీఎం కేసీఆర్​, గవర్నర్​ తమిళి సై సంతాపం తెలిపారు. ఆమె భారతీయ సినీ, సంగీత రంగంపై చెరగని ముద్రవేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. లత మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లు గవర్నర్ తెలిపారు.

latha mangeshkar
లతా మంగేష్కర్​ మృతి పట్ల సీఎం, గవర్నర్​ సంతాపం
author img

By

Published : Feb 6, 2022, 11:44 AM IST

Updated : Feb 6, 2022, 12:08 PM IST

Latha Mangeshkar: లతామంగేష్కర్ మృతిపట్ల సీఎం కేసీఆర్‌, గవర్నర్ తమిళిసై సంతాపం ప్రకటించారు. ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని కేసీఆర్‌ అన్నారు. లత భారతీయ సినీ, సంగీత రంగంపై చెరగని ముద్రవేశారని సీఎం కొనియాడారు. లతామంగేష్కర్ కుటుంబీకులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా: గవర్నర్

Governor tamilisai: లత మంగేష్కర్ మృతిపట్ల గవర్నర్‌ తమిళిసై సంతాపం తెలిపారు. లతామంగేష్కర్ మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని గవర్నర్‌ ప్రకటించారు. ఆమె మరణ వార్త విని చాలా బాధపడ్డానని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఆమె మరణం భారతదేశాకే తీరని లోటుగా మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆమె ఆలపించిన పాటలే తరతరాలకు ఆమె గొప్పతనాన్ని చాటుతాయన్న హరీశ్ రావు.... లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం లతా మంగేష్కర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. నటుడు చిరంజీవి నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఇక లేరని తెలుసుకుని గుండె పగలినట్టవుతోందంటూ సంతాపం తెలిపారు.

  • Extremely saddened to learn about the unfortunate demise of India's legendary singer #LataMangeshkar.

    முதுபெரும் பாடகி லதா மங்கேஷ்கர் காலமானார் என்ற செய்தி மிகுந்த வருத்தத்தை அளிக்கிறது.

    భారతీయ సినిమా నైటింగేల్ & లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం గురించి విని చాలా బాధపడ్డాను. pic.twitter.com/gtRdVdhnG5

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర: సీఎం కేసీఆర్

ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటలతో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్ చెరగని ముద్ర వేశారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. దేశానికి ఆమె గాంధర్వ గానం అందిందన్న కేసీఆర్.. భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరంగా​ పేర్కొన్నారు. లత మంగేష్కర్ మరణంతో సంగీత మహల్ ఆగిపోయిందంటూ విచారం వ్యక్తం చేశారు. దేశంలోని 20 భాషల్లో 1000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లత సరస్వతీ స్వర నిధని.. వెండితెర మీద నటుల హావభావాలకు తగినట్టుగా గాత్రాన్ని ఆలపించటం ఆమె ప్రత్యేకతని సీఎం అన్నారు.

  • కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన లెక్క లేనన్ని పురస్కారాలకు లతాజీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కాని లతాజీ లేని లోటు పూరించలేనిది. లతాజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి: సీఎం

    — Telangana CMO (@TelanganaCMO) February 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వంలో అలరించిన లతా మంగేశ్వర్, ఉత్తర దక్షిణాదికి సంగీత వారధిగా నిలిచిందన్నారు. హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ.. ఉర్దు కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా తన గాత్రంలో ఉర్దు భాషలోని గజల్ గమకాల సొబగులను ఒలికించేవారన్న కేసీఆర్ తెలిపారు. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే.. ఆమెకు దేశ, విదేశాల్లో లెక్క లేనన్ని పురస్కారాలు దక్కాయని స్మరించుకున్నారు.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి: బండిసంజయ్‌

Bandi sanjay: లతా మంగేష్కర్ మృతిపట్ల భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆమె లోటును ఎవరూ భర్తీ చేయలేరు: హరీశ్​ రావు

Harish rao: ప్రముఖ గాయని లతామంగేష్కర్ మృతి పట్ల ఆర్థిఖశాఖ మంత్రి హరీశ్‌రావు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. సినీరంగంలో ఆమె లోటును ఎవరూ భర్తీ చేయలేరని హరీశ్‌రావు అన్నారు.

ఒక గొప్ప గాయనిని కోల్పోయింది: తలసాని

Talasani: లత మంగేష్కర్ మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని ప్రగాఢ సంతాపం తెలిపారు. నాటికి, నేటికి ఆమె పాటలు అభిమానులను అలరిస్తూనే ఉంటాయని మంత్రి అన్నారు. సినీ పరిశ్రమ ఒక గొప్ప గాయనిని కోల్పోయిందని మంత్రి పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాందించారు: కిషన్​ రెడ్డి

  • Lata Mangeshkar Ji led a virtuous life that touched crores of people the world over, through her distinct & cherished voice.

    In her passing, the nation is bereaved of a Bharat Ratna & a National Icon.

    My condolences to her family & followers.

    Prayers for Sadgati 🙏🏻 pic.twitter.com/xiGpgoG3YF

    — G Kishan Reddy (@kishanreddybjp) February 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లతామంగేష్కర్‌ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె తన మధుర గాత్రంతో అభిమానుల హృదయాల్లో నిలిచారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను ఆమె సంపాదించుకున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

దివికేగిన అమృతగానం.. లతా మంగేష్కర్ అస్తమయం

Last Updated : Feb 6, 2022, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.