ETV Bharat / state

తెలంగాణకు భాజపా చేసింది శూన్యం: కేసీఆర్ - MODI

తెలంగాణకు భాజపా చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తియ్యటి, పుల్లటి మాటలు చెబుతూ ప్రజలను మోసగించాలని చూస్తున్నారని చెప్పారు. భాజపా వైఖరి శుష్కప్రియాలు... శూన్య హస్తాలు అన్న చందంగా ఉందన్నారు.

భాజపా తెలంగాణకు ఏం చేయలేదు: సీఎం కేసీఆర్
author img

By

Published : Sep 22, 2019, 4:03 PM IST

భాజపా తెలంగాణకు ఏం చేయలేదు: సీఎం కేసీఆర్

భాజపా ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. జిల్లాకో నవోదయ విద్యాలయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా భాజపా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన జిల్లాలను ఆదుకోవాలని విన్నవించినా కనికరించలేదన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పునర్విభజన చట్టం కింద ఏడాదికి 450 కోట్ల రూపాయల నిధుల రాష్ట్రానికి రావాల్సిన ఉండగా... ఒక సంవత్సరం నిధులు కేటాయించలేదని కేసీఆర్ తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు స్వయానా నీతి ఆయోగే 24 వేల కోట్లు ఇవ్వాలని తెలిపిందని, దానికీ స్పందన లేదన్నారు. కమలం పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర ప్రజలు వచ్చి తెలంగాణలో కలుస్తామని చెప్తుంటేనే... భాజపా కంటే తెరాస ప్రభుత్వం ఎంత గొప్పదో అర్ధమవుతోందని తెలిపారు. ఒక్క భాజపా పాలిత రాష్ట్రంలో కూడా ఆసరా పింఛన్‌ ఉందా.. అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఇవీ చూడండి: ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.