ETV Bharat / state

KCR Fire On Central: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు: కేసీఆర్ - ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం

KCR Fire On Central: తెలంగాణను మోదీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. నిబంధనల పేరిట ఆర్థికంగా అణచివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో ఎంపీలతో సమావేశం సందర్భంగా సీఎం మాట్లాడారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్
author img

By

Published : Jul 16, 2022, 6:51 PM IST

KCR Fire On Central: తెలంగాణకు వ్యతిరేకంగా దుష్ప్రచారం... భాజపా దిగజారుడుతనానికి నిదర్శనమని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పట్ల కేంద్రం కక్షపూరిత వైఖరిపై ఉభయసభల్లో గళం విప్పాలని ఎంపీలకు సూచించారు. హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానుండగా ఎంపీలతో సీఎం మాట్లాడారు. కేంద్రంపై పోరాటానికి పార్లమెంటు ఉభయ సభలనే వేదికలుగా మలుచుకోవాలని సూచించారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. నిబంధనల పేరిట ఆర్థికంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు భాజపా సోషల్ మీడియా గ్రూపులకు ఎలా చేరుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. దేశం, రాష్ట్రం మధ్య గోప్యంగా ఉండాల్సినవి లీక్‌ చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవహారాలను లీక్ చేయడం నేరపూరిత చర్యగా అభివర్ణించారు. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కన్నా ఎక్కువగా ఉన్నాయని ఎంపీలకు సీఎం వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం పరిధులకు ఎఫ్​ఆర్​బీఎం లోబడే ఆర్థిక వ్యవహారాలు నడుపుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎనిమిదేళ్లలో ఎన్నడూ ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమని వెల్లడించారు. ఆర్బీఐ వేసే బిడ్లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్ పలుకుతున్న విషయం వాస్తవం కాదా అని కేంద్రాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ఎఫ్ఆర్​బీఎం పరిధిని రూ.53వేల కోట్లుగా ప్రకటించి మాట మార్చడమేంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రూ.53 వేల కోట్ల నుంచి రూ.25వేల కోట్లకు కుదించడం కుట్ర కాదా అని కేంద్రాన్ని నిలదీశారు. విద్యుత్ సంస్కరణల రాష్ట్రాలపై ఒత్తిడి తేవడాన్ని పార్లమెంట్​లో నిలదీయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సిఫారసులను బుట్టదాఖలు చేయడంపై ప్రశ్నించాలని ఎంపీలకు వివరించారు.

దేశంలో ఎక్కడ అభివృద్ధి సాధిస్తున్నా అది దేశ జీడీపీకే సమకూరుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశ జీడీపీకి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్న ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి వివరించారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది ఎంత.. తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని? అనే లెక్కలు చూస్తే సామాన్యులకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం అర్థమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.