ETV Bharat / state

ప్రచారంలో హోరెత్తిస్తున్న గులాబీ బాస్ నేడు భైంసా, ఆర్మూర్‌, కోరుట్లలో కేసీఆర్ సభలు - బీఆర్​ఎస్​ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

CM KCR Election Campaign Today 2023 : ఓ వైపు అధినేత బహిరంగసభలు, మరోవైపు అభ్యర్థుల సుడిగాలి పర్యటనలతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీదళం ప్రచారాలు హోరెత్తిస్తోంది. రెండు నెలలు క్రితమే అభ్యర్థుల ఖరారుతో అందరికంటే ముందుగానే రంగంలోకి దిగిన గులాబీ రేసుగుర్రాలు.. వరుసగా ఊళ్లను చుట్టేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న అధికార పార్టీ శ్రేణులు.. హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఇవాళ భైంసా, ఆర్మూర్‌, కోరుట్లలో జరిగే ప్రజాఆశీర్వాద సభలకు బీఆర్​ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

Telangana Assembly Elections 2023
BRS MLA Candidates Campaign in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 7:46 AM IST

BRS Campaign 2023 రాష్ట్రవ్యాప్తంగా గులాబీమయం నేడు కేసీఆర్​ భైంసా, ఆర్మూర్‌, కోరుట్లలో సభలు

CM KCR Election Campaign Today 2023 : సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తూకారంగేట్, ఇందిరాలక్ష్మీనగర్, వెంకట్‌నగర్ ప్రాంతాల్లో ఉపసభాపతి పద్మారావు ఎన్నికల ప్రచారం చేశారు. కంటోన్మెంట్‌ బీఆర్ఎస్​ ముఖ్యనేతలతో సమావేశమైన మంత్రి తలసాని.. దివంగత నేత సాయన్న కుమార్తె లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్‌షాకోట్ కార్పొరేటర్ శ్రీనాథ్‌రెడ్డి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. తనపై ఐటీ దాడుల వెనుక మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉందన్న బడంగ్‌పేట మేయర్‌ పారిజాత వ్యాఖ్యలను మహేశ్వరం బీఆర్ఎస్​ నేతలు తిప్పికొట్టారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రోడ్‌షో నిర్వహించారు.

BRS Campaign in Telangana 2023 : హనుమకొండ ఎన్జీఓస్‌ కాలనీలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్‌ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారంలో చెత్తడంపింగ్‌ విషయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని స్థానికులు నిలదీశారు. ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు తమపై దాడిచేశారని గ్రామస్థులు వాపోయారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక, జమ్మికుంట మండలాల్లో హుజురాబాద్ బీఆర్ఎస్​ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి.. తన సతీమణితో కలిసి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు. యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, ప్రచారం నిర్వహించారు.

ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి ప్రజలు మాత్రం వివేకంతో ఆలోచించి ఓటు వేయాలి సీఎం కేసీఆర్

BRS Candidate Hanmant Shinde Dance in Campaign : పార్టీలో చేరిన తరవాత తొలిసారిగా నాగర్‌కర్నూల్‌లో పర్యటించిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి.. ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే మద్నూర్‌లో కార్యకర్తల్లో జోష్‌ నింపుతూ వినూత్నంగా ప్రచారం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సంఘాలు, గౌడ కులస్థులతో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. బోధన్‌లో జరిగిన యువగర్జన సభకు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha in YuvaGarjana) హాజరయ్యారు.

BRS Latest Joining in Telangana : సంగారెడ్డికి చెందిన గ్రాడ్యుయేట్‌ ఫోరం సభ్యుడు ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఎఫ్​డీసీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడ్యారంలో దుబ్బాక నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు.

KTR Attended BRS Activists Meeting at Bikkanur : ఈ ఎన్నికల్లో దిల్లీ దొరలకు గల్లీ ప్రజలకు మధ్య పోరాటం అందుకే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ

Today CM KCR Meetings Details : రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ప్రజాఆశీర్వాద సభలకు హాజరవుతున్న బీఆర్​ఎస్​ అధినేత.. ఇవాళ మూడు చోట్ల జరిగే సభలకు హాజరుకానున్నారు. నిర్మల్‌ జిల్లా భైంసాలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభా ఏర్పాట్ల(Praja Ashirvada Sabha Arrangements)ను పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పురాణం సతీష్, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్‌రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్‌లో కేసీఆర్​ బహిరంగసభ కోసం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరగనున్న కేసీఆర్‌ సభకు భారీ జనసమీకరణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ తెలిపారు. సంగారెడ్డిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ.. తమ పార్టీ కేసీఆర్‌ మామకే అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

BRS Praja Ashirvada Sabha at Sathupalli : ఖమ్మం ప్రజలు ఏపీ తెలంగాణ రోడ్లను చూస్తే అభివృద్ధి ఎలా ఉందో తెలుస్తుంది మళ్లీ గెలిచేది మనమే

'కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డోడా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.