వచ్చే నెల ఒకటో తేదీన జరగబోయే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యంత్రాంగాన్ని ఆదేశించారు. అందులో కృష్ణాజలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. కేఆర్‌ఎంబీ సమావేశం ఎజెండా అంశాలపై బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్, ప్రత్యేకాధికారి శ్రీధర్ దేశ్ పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, బ్రజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌లో సీనియర్ న్యాయవాది రవీందర్‌రావు, అంతర్‌రాష్ట్ట్ర విభాగం చీఫ్‌ఇంజినీర్ మోహన్‌కుమార్, సూపరింటెండింగ్ ఇంజినీర్ కోటేశ్వర్‌రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డు భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ‘‘కృష్ణా జలాల్లో తెలంగాణ నీటివాటా కోసం కృష్ణాబోర్డుతో పాటు ట్రైబ్యునళ్లు సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలి. 1న జరిగే సమావేశానికి సాధికారిక సమాచారంతో హాజరై, సమర్థŸంగా మాట్లాడాలి’’ అని సీఎం సూచించారు
ఉద్యమగీత కార్టూన్ల సంకలనం ఆవిష్కరణ
తెలంగాణ ఉద్యమంలో వివిధ ఘట్టాలను ప్రతిబింబించే విధంగా కార్టునిస్టు మృత్యుజయ వేసిన కార్టూన్ల సంకలనం ఉద్యమగీతను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్‌కుమార్, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి, సాంస్కృతిక సంచాలకుడు హరికృష్ణ పాల్గొన్నారు.
సీఎంకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన జస్టిస్ చంద్రయ్య
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. తన కుమారుడి వివా హానికి ఆహ్వానించి, పెళ్లి పత్రికను అందించారు.
ఇవీ చూడండి: cm kcr review: జలవివాదాలు, కేంద్రం గెజిట్‌పై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష