ETV Bharat / state

గవర్నర్​కు సీఎం కేసీఆర్​ బర్త్​డే విషెస్​.. - telangana news

CM KCR Wishes to Governor: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు సీఎం కేసీఆర్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు చాలా సంవత్సరాల పాటు సేవ చేసేలా తమిళిసైని ఆశీర్వదించాలని భగవంతుణ్ని ప్రార్థించారు.

గవర్నర్​కు సీఎం కేసీఆర్​ బర్త్​డే విషెస్​.. విభేదాలు తొలగినట్లేనా?

author img

By

Published : Jun 2, 2022, 7:47 PM IST

CM KCR Wishes to Governor: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్ గవర్నర్​కు లేఖ పంపారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్... ప్రజలకు చాలా సంవత్సరాల పాటు సేవ చేసేలా తమిళిసైని ఆశీర్వదించాలని భగవంతుణ్ని ప్రార్థించారు.

గవర్నర్​కు సీఎం కేసీఆర్​ జన్మదిన శుభాకాంక్షలు

రాజ్​భవన్​, ప్రగతిభవన్​ల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. ఈ ఏడాది మార్చిలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభించాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై.. తెలంగాణకు గవర్నర్‌గా వచ్చినా తన పాత వాసనలను పోగొట్టుకోలేదని వ్యాఖ్యానించింది. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలోనే గవర్నర్‌తో అసలు సమస్య ఉందని.. ఉన్నత మర్యాదలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంతో హఠాత్తుగా కయ్యం పెట్టుకున్నారని పేర్కొంది.

గతంలో దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్​తో విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినా... ఆ పరిస్థితిని తాను కోరటం లేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు... అధికార పార్టీకి విరుద్ధమైన నిర్ణయాలు సైతం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ పరిధికి లోబడి గవర్నర్‌ విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ఈ విభేధాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ గవర్నర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్​ తమిళిసైకి సీఎం కేసీఆర్​ లేఖ పంపడంతో మళ్లీ గవర్నర్​, ప్రభుత్వం మధ్య సఖ్యత నెలకొంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.