CM Appreciate Farmer: రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ వంటి రంగాల అభివృద్ధితో యువత వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచుకోవడం సంతోషకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. వాణిజ్య పంటలను కూడా వినూత్నరీతిలో పండిస్తూ నికరాదాయన్ని గడిస్తున్నారన్నారు. అరకొర జీతంతో పనిచేయడమే ఉద్యోగమనే మానసిక స్థితి నుంచి యువత బయట పడుతుండటం ఆహ్వానించదగిన పరిణామమని కేసీఆర్ అన్నారు. సొంత గ్రామాల్లోనే పచ్చని పంట పొలాల మధ్య ప్రకృతిలో భాగమై ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచుకొని తమ కాళ్లపై నిలబడడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తున్నారని కేసీఆర్ అభినందించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆరునెలలకోసారి పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన పన్నాల శ్రీనివాసరెడ్డి అనే యువరైతును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. తన బీడు భూములు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమై పంటలు పండుతున్నందున... కొంత ఆదాయాన్ని పేదల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్లు రైతు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు.. పంటకు పది వేల రూపాయలు ఆరు నెలలకోసారి సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్లు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తన సంపాదనతో కొంత మొత్తాన్ని సామాజిక బాధ్యత కోసం కేటాయించిన శ్రీనివాస్ రెడ్డి.. యువతకు ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: