ETV Bharat / state

'బడ్జెట్‌ సమావేశాల్లో ఏం సమస్యలను ప్రస్తావించాలి..?'

బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు వీలుగా సోమవారం కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సైకిల్ యాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజాసమస్యల్లో ఏ అంశాలను ప్రస్తావించాలనే అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.

clp-meeting-on-budget-meetings-on-monday
బడ్జెట్‌ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కాంగ్రెస్ సమాయత్తం
author img

By

Published : Mar 14, 2021, 7:30 PM IST

రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం రేపు జరగనుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగే ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. బడ్జెట్‌ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు ముందస్తుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

సోమవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించిన తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో ఏ అంశాలను ప్రస్తావించాలి... బడ్జెట్‌ సమావేశాల్లో ఏయే సమస్యలను లేవనెత్తాలన్న అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా, పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ... నిర్వహించిన సైకిల్‌యాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజాసమస్యల్లో ఏ అంశాలను ప్రస్తావించాలన్న విషయాలపైనా చర్చించనున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు.

ఇదీ చూడండి: చంటిబిడ్డను ఎత్తుకొని ఆడించిన కానిస్టేబుల్​కు సీపీ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.